టాలీవుడ్ లో మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్దం అయింది. నిర్మాత డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కళ్యాణ్ సినిమా ఎంట్రీ ఎప్పటి నుంచో వార్తల్లో వినిపిస్తోంది. ఆఖరికి ఇప్పటికి ఫైనల్ అయింది. డైరక్టర్ శ్రీవాస్ మీదుగా కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు.
గతంలో ఎమ్మెల్యే, నేనే రాజు నేనే మంత్రి లాంటి మంచి సినిమాలు నిర్మించిన భరత్ చౌదరి నిర్మిస్తారు. సాక్ష్యం సినిమా తరువాత శ్రీవాస్ కథ, మాటలు, దర్శకత్వం అందిస్తున్న సినిమా ఇది. వాస్తవానికి సినిమాను దానయ్యే నిర్మిస్తారని, మారుతి డైరక్షన్ అని వార్తలు వినవచ్చాయి.
కానీ ఇప్పుడు తన కొడుకు సినిమాను తనే నిర్మిస్తే బాగుండదనో , మరే కారణం చేతనో భరత్ చౌదరికి ఈ ప్రాజెక్టును దానయ్య అప్పగించారు. త్వరలో ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. ప్రస్తుతం స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ వంటి వ్యవహారాలు ఫైనల్ స్టేజ్ లో వున్నాయి.