ఆ హీరో కెరీర్ కు డేంజర్ బెల్స్

నిజానికి ప్రచారంలో పరిచయాలన్నీ వాడుతారనే కమిట్ మెంట్ ఉంది. కానీ బిజనెస్ లో కూడా హామీ కావాలంటున్నారు. ఇది నిజంగా ఆ హీరోకు అవమానకరం.

కెరీర్ లో 2-3 మంచి హిట్స్ ఉన్నాయి. కానీ రీసెంట్ గా వరుసగా 3 డిజాస్టర్లు ఇచ్చాడు. అవి ఏ రేంజ్ డిజాస్టర్లంటే.. ఎవ్వరికీ ఒక్క పైసా మిగల్లేదు సరికదా, సదరు హీరో సినిమాల ఎంపికపై జనాలకు అనుమానం వచ్చేసింది. అంతేకాదు, ఆ డౌట్ మార్కెట్ కు కూడా వచ్చేసింది.

దీంతో ఆ హీరో కెరీర్ కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రస్తుతం అతడు ఓ సినిమా చేస్తున్నాడు. పైకి పెద్ద సినిమా అని చెబుతున్నారు కానీ సగానికి సగం బడ్జెట్ కోత పెట్టారు. అక్కడితో ఆగలేదు, వర్కింగ్ డేస్ తగ్గించేందుకు ఆగమేఘాల మీద షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు.

అన్నింటికంటే పెద్ద సమస్య ఏంటంటే.. ఇప్పుడా సినిమాకు బయ్యర్లు దొరకడం లేదు. హీరోకు మంచి బ్యాకింగ్ ఉన్నప్పటికీ ముందుకురావడానికి బయ్యర్లు జంకుతున్నారు. దీంతో ఈ హీరో కొత్త సినిమా కోసం ‘కాంపౌండ్’ నుంచి ఎవరో ఒకరు హామీగా ముందుకు రావాల్సిన పరిస్థితి.

నిజానికి ప్రచారంలో పరిచయాలన్నీ వాడుతారనే కమిట్ మెంట్ ఉంది. కానీ బిజనెస్ లో కూడా హామీ కావాలంటున్నారు. ఇది నిజంగా ఆ హీరోకు అవమానకరం.

మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా ఓటీటీ డీల్ ఇంకా సెట్ కాలేదు. పరిచయాలన్నింటినీ వాడినప్పటికీ ఎవ్వరూ ముందుకురావడం లేదు. ఇక శాటిలైట్ రైట్స్ సంగతి సరేసరి. ఓవైపు మార్కెట్ ఇలా ఉంటే, మరోవైపు సినిమా షూటింగ్ పూర్తి కావొస్తోందంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అదే మేజిక్కు.

30 Replies to “ఆ హీరో కెరీర్ కు డేంజర్ బెల్స్”

  1. సినిమాలను కేవలం ott లో చూడటానికి ట్రై చేయండి. సినిమా కి అయ్యే ఖర్చులో 75% శాతం ఈ హీరోలే తింటున్నారు. హీరోయిన్ లు కూడా ఎంత కష్టపడ్డా కేవలం బడ్జెట్ లో 1% ఇస్తారు డిమాండ్ చేస్తే వాళ్ళను మారుస్తారు. ఈ కొడుకులకి బాగా బలిసింది. Avoid watching cinema in theatres.

Comments are closed.