ఎర్రమట్టి దిబ్బలు చెప్పే కధలు ఎన్నో?

విశాఖ భీమిలీకి మధ్యలో ఎర్ర మన్ను దిబ్బలు ఉన్నాయి. పర్యాటకులకు ఇవి కనుల విందు చేస్తాయి. ప్రకృతి ప్రేమికులకు అవి ఎంతో ముచ్చట చేస్తాయి. సినీ సెల్యూలాయిడ్ కి ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా…

విశాఖ భీమిలీకి మధ్యలో ఎర్ర మన్ను దిబ్బలు ఉన్నాయి. పర్యాటకులకు ఇవి కనుల విందు చేస్తాయి. ప్రకృతి ప్రేమికులకు అవి ఎంతో ముచ్చట చేస్తాయి. సినీ సెల్యూలాయిడ్ కి ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా ఉంటాయి. ఎన్ని సినిమాల షూటింగులు అక్కడ జరిగాయో వెండి తెర నిండు పున్నమిగా మారి ఎందరికి ఆహ్లాదం పంచిందో ఎర్రమన్ను దిబ్బలకు మాత్రమే తెలుసు.

అటువంటి ఎర్రమన్ను దిబ్బల మీద వివాదం సాగుతోంది. వాటి భూములను తవ్వేస్తున్నారు అని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇపుడు ఆ ఎర్రమన్ను దిబ్బలలో రెండు వందల యాభై ఎకరాలను భీమిలీ హౌసింగ్ సొసైటీకి అప్పగించారని జనసేన కార్పోరేటర్ ఒకరు కోర్టుకు వెళ్ళారు.

దాంతో ఈ మొత్తం వ్యవహారాల మీద అ విచారణనకు ప్రభుత్వం ఇపుడు విశాఖ జిల్లా కలెక్టర్ ని ఆదేశించింది. హౌసింగ్ సొసైటీకి గత ప్రభుత్వం భూములు కేటాయించడం మీదనే ఈ విచారణ అని అంటున్నారు. అయితే ఎర్రమన్ను దిబ్బల విషయంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాలు చేసే వారు దందాలు చేసే వారు అక్కడ కూడా చేయాల్సింది చేశారు అని అంటున్నారు.

అలా సమగ్రమైన విచారణ జరిపిస్తే ఎర్రమన్ను దిబ్బల విషయంలో అసలు నిజాలు వెలుగు చూస్తాయని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. ఈ విషయంలో పూర్తి విచారణ అవసరం అన్న డిమాండ్ ఉంది. ఎర్రమన్ను దిబ్బలు అన్నవి వారసత్వ సంపదగా ఉన్నాయి. ఇవి హేరిటేజ్ కి తార్కాణంగా నిలుస్తున్నాయి. వీటి పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తేనే ఎర్రమన్ను దిబ్బలకు అందం గౌరవం దక్కుతాయని అంటున్నారు.

3 Replies to “ఎర్రమట్టి దిబ్బలు చెప్పే కధలు ఎన్నో?”

  1. ఋషి కొండా కి సగం గుండు కొట్టేసే ..గ్రీన్ మెట్ వేసినప్పుడు రాయాల్సింది ఇలాంటి ఆర్టికల్ GA … అప్పుడు పడుకుని పదకొండు వొచ్చాక లేచావా నిద్ర ..

Comments are closed.