దర్శకుడు రాజమౌళి సాధారణంగా లగ్జరీకి దూరంగా వుంటారు. ఆయన ఎక్కువగా సింపుల్ లివింగ్ నే ఇష్టపడతారు. ఇప్పటికీ ఆయన తన సోదరులు, సన్నిహితులతో కలిసి అపార్ట్ మెంట్ లోనే వుంటారు.
ఆ టైమ్ కు ఏ కారు వుంటే దాంట్లో, లేదూ అంటే క్యాబ్ లోనే వెళ్తారు. అలాంటిది ఇప్పుడు మాంచి లగ్జరీ కారు కొన్నారు. కొటి రూపాయిలు ఖర్చు చేసి బిఎమ్ డబ్ల్యు 7 సీరీస్ వెహికల్ ను తీసుకున్నారు.
బాహుబలి సీరీస్ లాభాల్లో రాజమౌళి కి మూడోవంతు వాటా వుంది. అంతే కాకుండా, పంపిణీలో కూడా ఆయన కుమారుడు కార్తికేయ పాలు పంచుకున్నారు. అందువల్ల డబ్బులకు లోటు లేదు. అయితే అలా వచ్చిన వంద కోట్లకు పైగా మొత్తాన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారన్నదే తెలియదు.
చాలా కాలం క్రితం ఆయన, కీరవాణి, ఆయన సన్నిహితుడు సాయి కొర్రపాటి కలిసి నల్గొండ సమీపంలో కొంత మెరక భూమి కొన్నారు. అక్కడ ఫామ్ హవుస్ కట్టాలని ఆలోచన వుంది. అయితే అది నాచురల్ గా పల్లెటూరును ప్రతిబింబించేలా వుండాలన్నది వాళ్ల ఆలోచన.
ఇదిలా వుంటే బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి తరువాతి సినిమా ఇంకా డిసైడ్ కాలేదు. బాలీవుడ్ సినిమా చేసే ఆలోచనలో వున్నారని సన్నిహిత వర్గాల భోగట్టా. సరైన సబ్జెక్ట్ కోసం చూస్తున్నారని, అది దొరకగానే, దాన్ని బట్టి డెసిషన్ వుంటుందని కూడా టాక్ వినిపిస్తోంది.