ఎవరైనా తెలుసున్నవాళ్లకు ఏదైనా పని ఎందుకు అప్పచెబుతాం? కాస్త ఖర్చు లేకుండానో, తక్కువకో పని అవుతుందని. ఆస్తుల అమ్మకాలు బ్రోకర్లకు అప్పగిస్తే పర్సంటేజ్ ఇవ్వాల్సి వుంటుంది. అదే నేరుగానో, తెలుసున్నవారి ద్వారానో విక్రయిస్తే అది కాస్త మిగులుతుంది. అసలు రేటు దక్కుతుంది. ఇలాగే అనుకుంటారు ఎవరైనా. కానీ అలా మనవాడే అనుకున్న వాళ్లు కూడా కమిషన్ కొట్టేస్తే..?
టాలీవుడ్ లో అదే జరిగింది. ఆయన ఓ టాప్ డైరక్టర్. ఎప్పుడో కాస్త తక్కువ రేటుకు నగర శివార్లలో కొంత భూమి కొన్నారు. ఇప్పుడు అమ్మేద్దాం అనుకున్నారు. అప్పట్లో ఎవరైతే కొనిపించారో ఆ నిర్మాతకే ఆ బాద్యత అప్పగించారు. రీజనబుల్ గా అమ్మిస్తాడని, కమిషన్ లాంటి వ్యవహారాలు లేకుండా తనకు చేతికి డబ్బులు వస్తాయని.
కానీ ఆ నిర్మాత మహా దేశముదురు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే టైపు వ్యవహారం. అమ్మకం సజావుగానే జరిగింది కానీ తను గిల్లాల్సింది తను గిల్లేసాడని, ఆ విధంగా కమిషన్ దక్కించుకుని వ్యాపార ధర్మం చూపించాడని తెలుస్తోంది.
కానీ విషయం దాగదుగా. ఈ సంగతి తెలిసి ఆ దర్శకుడు చాలా ఫీలవుతున్నాడట. ఇక ఆ నిర్మాతను దగ్గరకు కూడా రానివ్వడం లేదట. ఇక ఆ నిర్మాత చేయాలనుకున్న ఓ ప్రాజెక్టు, ఈ డైరక్టర్ సహకారం లేకుండా ఎలా చేస్తాడో? చిన్నదానికి కక్కుర్తి పడితే పెద్ద ప్రాజెక్టు చేజారిపోయేలా వుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.