దర్శకుడిని ఇబ్బంది పెడుతున్న హీరో

దర్శకుడు చెప్పింది చెప్పినట్లు వినేస్తే హీరో ఎందుకు అవుతారు? నీ ఎడం చేయి తీయి, నా లెఫ్ట్ హ్యాండ్ పెడతా అని అనాలి కదా? ఓ యంగ్ హీరో ఇలాగే ఆలోచిస్తారు అని ఇండస్ట్రీలో…

దర్శకుడు చెప్పింది చెప్పినట్లు వినేస్తే హీరో ఎందుకు అవుతారు? నీ ఎడం చేయి తీయి, నా లెఫ్ట్ హ్యాండ్ పెడతా అని అనాలి కదా? ఓ యంగ్ హీరో ఇలాగే ఆలోచిస్తారు అని ఇండస్ట్రీలో టాక్ వుంది.

కథలో దూరిపోతారని, మేకింగ్‌లో కలుగచేసుకుంటారని అంటారు. అయితే అది దర్శకుడిని బట్టి వుంటుంది అనే మినహాయింపు కూడా వుంది. ప్రస్తుతం ఓ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. అంతకు ముందు వారి కాంబినేషన్ లో వచ్చిన హిట్ కారణంగా ప్రాజెక్ట్ మీద క్రేజ్ వుంది.

కానీ ఆశించిన స్పీడ్ లో జరగడం లేదు. నిజానికి స్పీడ్ కు పెట్టింది పేరు ఆ దర్శకుడు. కానీ చేస్తున్న సినిమా మాత్రం అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఈ మధ్య ఓ షెడ్యూలు కూడా క్యాన్సిల్ అయింది. ఆర్ధిక ఇబ్బందులు అనే టాక్ వుంది.

కానీ అది మాత్రమే కాదు, హీరో ఇబ్బంది పెడుతున్నాడు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. గతంలో సినిమా చేసినపుడు ఇదే హీరో ఈ మాదిరిగా లేడు. కానీ ఇప్పుడు మాత్రం కాస్త తెేడాగా వుంది అన్న కామెంకట్ కూడా వినిపిస్తోంది.

ఏమైతేనేం డేట్ లైన్, డెడ్ లైన్ పెట్టుకుని, అనౌన్స్ చేసి మరీ సినిమా తీసి చూపించగల దర్శకుడు ఇప్పుడు కిందా మీదా అవుతున్నారు. ఈ నెలాఖరులో ఒక షెడ్యూలు ప్లాన్ చేసి వుంది. అది పెర్ ఫెక్ట్ గా జరిగితే ఓకె. లేదూ అదీ వాయిదా అంటే సమ్ థింగ్.. సమ్ థింగ్ అనుకోవాల్సిందే.