కేవలం క్రియేటివ్ ఇష్యూస్ కారణంగా బన్నీ-లింగుస్వామి సినిమా ఆగిపోయిందనేది పైకి చెప్పిన కారణం. కానీ తెరపైకి రాని మరికొన్ని ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అలా డిలే అయిన ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు ఫైనలైజ్ అయింది. బన్నీ-లింగు స్వామి కాంబినేషన్ లో కొత్త సినిమా వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ప్రారంభం అవుతుంది.
తెలుగు-తమిళ భాషల్లో స్టుడియో గ్రీన్ బ్యానర్ పై ఈ పాటికే ఇది సెట్స్ పైకి రావాల్సింది. కానీ లెక్కలు తేలకపోవడంతో లేట్ అయింది. ఈ గ్యాప్ లో అటు లింగుస్వామి విశాల్ తో సినిమా ప్రారంభిస్తే.. ఇటు వక్కంతం కలిసి సినిమా స్టార్ట్ చేశాడు బన్నీ. ఇప్పుడు వ్యవహారాలన్నీ సెట్ అవ్వడంతో నా పేరు సూర్య కంప్లీట్ అయిన వెంటనే లింగుస్వామి సినిమాను స్టార్ట్ చేస్తాడు బన్నీ.
లింగుస్వామి సినిమా కోసం ఫిబ్రవరి నుంచి కాల్షీట్లు అడిగారు స్టుడియో గ్రీన్ నిర్మాతలు. కానీ నా పేరు సూర్య సినిమా అప్పటికి కంప్లీట్ కాదు. అందుకే ఏప్రిల్ నుంచి కాల్షీట్లు కేటాయించాడు అల్లు అర్జున్. బన్నీ సినిమాకు సంబంధించి కథ, స్క్రీన్ ప్లే కంప్లీట్ అయ్యాయని దర్శకుడు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఓకే అవ్వడంతో విక్రమ్ కుమార్ తో చేయాల్సిన సినిమా ఇంకాస్త వెనక్కి వెళ్లింది.