పవన్ కళ్యాణ్-సంపత్ నంది కాంబినేషన్ లో రాబోయే గబ్బర్ సింగ్ 2 సినిమా హీరోయిన్ గా ప్రణీత ఓకె అయిందన్నది వట్టిమాటలేనట. ఇప్పటికీ ఆ సినిమాకు సంబంధించినంత వరకు పవన్ ఫస్ట్ చాయిస్ దీపికా అన్నది స్పష్టమట. ఆమె తేదీల కోసమే యూనిట్ ఇంకా కిందా మీదా పడుతోంది. ఇక మరీ ఆమె వీలు కాకుంటే మరో రెండు ఆల్టర్నేటివ్ లు వుంచుకున్నారట. అయితే వాటిలో కూడా ప్రణీత పేరు లేదని తెలిసింది.
ఇదిలా వుంటే ఈ సినిమాకు నవంబర్ తొలివారంలో కొబ్బరికాయ కొట్టే అవకాశం వుందని వినికిడి. దీని తరువాత సినిమా పవన్ పీవీపి బ్యానర్ పై చేస్తారు. మరి ఇలా రెండు సినిమాలు వరుసగా కమిట్ అయిన నేపథ్యంలో పవన్ రాజకీయాల్లోకి వస్తాడని వినిపిస్తున్న మాటలు నమ్మదగ్గవేనా? అనుమానమే