రామ్ చరణ్‌ చోటా మేస్త్రి

ముఠామేస్త్రి సినిమా మెగాస్టార్‌ చిరంజీవికి ఎంత పాపులార్టీ తెచ్చిందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్‌ కు కూడా అలాంటి సినిమా స్క్రిప్ట్‌ ఒకటి రెడీ అవుతోంది. దాని పేరు చోటా మేస్త్రి.   Advertisement…

ముఠామేస్త్రి సినిమా మెగాస్టార్‌ చిరంజీవికి ఎంత పాపులార్టీ తెచ్చిందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్‌ కు కూడా అలాంటి సినిమా స్క్రిప్ట్‌ ఒకటి రెడీ అవుతోంది. దాని పేరు చోటా మేస్త్రి.  

రామ్ చరణ్‌ కు రచ్చ లాంటి హిట్‌ ఇచ్చి, పవన్‌ దగ్గర గబ్బర్‌ సింగ్‌ 2 ఆఫర్‌ అందిపుచ్చుకున్న సంపత్‌ నంది ఈ స్క్రిప్ట్‌ సిద్ధం చేసినట్లు, దానికి రామ్ చరణ్‌ ఓకె చేసినట్లు తెలిసింది. పక్క మాస్‌ మసాలా అంశాలతో ఈ స్క్రిప్ట్‌ సిద్ధమైందట. 

  పవన్‌ సినిమా అయిన తరువాత సంపత్‌ మళ్లీ ఇటు వస్తాడన్నమాట. అంటే మెగాక్యాంప్‌ బాగానే పట్టుకున్నట్లుంది సంపత్‌ ను. మరి అల్లు అర్జున్‌ తో సినిమా ఎప్పుడో?