సమంత అంటేనే గోల్డెన్ లెగ్. ఆమె నటించిన సినిమాల్లో చాలావరకు సూపర్ హిట్ సినిమాలే. ‘జబర్‌దస్త్’, ‘రామయ్యా వస్తావయ్యా’ మినహాయిస్తే ఆమె నటించిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించాయి. లేటెస్ట్‌గా ఆమె ఖాతాలోపడ్డ సూపర్ హిట్ సినిమా ‘అత్తారింటికి దారేది’.
ఇక, సమంతకి సౌత్‌లో వున్న ఫాలోయింగ్ చూసి బాలీవుడ్ హీరోలూ ఆమెకు ఆఫర్లు ఇస్తున్నారట. అయితే సమంత మాత్రం, బాలీవుడ్‌కి వెళ్ళే విషయమై ఎటూ తేల్చుకోలేకపోతోంది. బాలీవుడ్‌కి వెళితే సౌత్‌లా వుండదు. సౌత్‌లో ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసేయొచ్చు. బాలీవుడ్‌లో మాత్రం ఓ సినిమాకి కమిట్ అయితే, ఆ సినిమా కోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి వుంటుంది. ఆ సినిమా తేడా కొడితే కెరీర్ అటకెక్కిపోయే ప్రమాదమూ పొంచి వుంటుంది.
అందుకే, సమంత బాలీవుడ్ సినిమా అవకాశాల విషయమై ఆచి తూచి వ్యవహరిస్తోంది. చాలా పెద్ద ఆఫర్ అయితే తప్ప వెళ్ళకూడదనీ, అది కూడా పక్కా టైమ్ షెడ్యూల్‌తో ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా వుంటేనే చేయాలనుకుంటోందట సమంత.
అసిన్, సౌత్‌ని వదిలేసి బాలీవుడ్‌కి వెళ్ళి, అక్కడే సెటిలైపోయిందిగానీ, ఇప్పుడామె పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. తమన్నా సంగతి సరే సరి. కాజల్ కూడా బాలీవుడ్‌కి వెళ్ళొచ్చేసింది. తాప్సీ పరిస్థితీ అంతే. అందుకనే, సమంత కాస్తంత కన్‌ఫ్యూజన్‌లో వుంది బాలీవుడ్‌కి వెళ్ళే విషయమై.