రైట‌ర్ కి హ్యాండిచ్చిన నాగ్‌

కొత్తవారిని పోత్సహించే విషయంలో మిగతా హీరోల కంటే కొన్ని కిలోమీటర్లు ముందుంటారు నాగార్జున. అనుభవం గురించి పట్టించుకోరు.. జస్ట్‌ నమ్మకం కుదిరితే చాలు. అందుకే ఊహించని కాంబినేషన్లు నాగ్తో సెట్‌ అవుతుంటాయి.  Advertisement వేగ్నేశ…

కొత్తవారిని పోత్సహించే విషయంలో మిగతా హీరోల కంటే కొన్ని కిలోమీటర్లు ముందుంటారు నాగార్జున. అనుభవం గురించి పట్టించుకోరు.. జస్ట్‌ నమ్మకం కుదిరితే చాలు. అందుకే ఊహించని కాంబినేషన్లు నాగ్తో సెట్‌ అవుతుంటాయి. 

వేగ్నేశ సతీష్‌ దర్శకత్వంలో నాగ్‌ నటిస్తాడంటే ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. సతీష్‌ మంచి రైటర్‌. రచయితగా అనుభవం ఉంది. అందుకే ఈ కాంబినేషన్‌ సెట్‌ అయ్యిందనుకొన్నారు. వెనుక దుర్గా ఆర్ట్స్‌ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ కూడా తోడుగా ఉంది. ఇంకేం.. ఈ సినిమా పట్టాలెక్కేస్తుంది అనుకొన్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు లేదట. ఇప్పుడంటే ఇప్పుడు కాదు.. అస్సలు లేదట.

సతీష్‌ లైన్‌ అయితే బాగా చెబుతున్నాడు గానీ…  పూర్తి  స్క్రిప్ట్‌ దగ్గరకు వచ్చే సరికి నాగ్‌ ని మెప్పించలేకపోతున్నాడట. దాంతో నాగ్‌… సినిమా చేసేది లేదని చెప్పేశాడు. గత రెండేళ్ల నుంచి అన్నపూర్ణ కాంపౌండ్‌ చుట్టూ తిరుగుతున్న సతీష్‌.. నాగ్‌ నో చెప్పేసరికి పాపం డల్లయిపోయాడు. ప్చ్‌.. ఏం చేస్తాం..?  బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైమ్.