అత్తారింటికి దారేది థాంక్స్ గివింగ్ సభలో హీరొ పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రకంపనలు ఇంకా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఎవరికి తోచినట్లు వారు భాష్యాలు చెప్పుకుంటున్నారు. అయితే ఇంతకీ అసలు విషయం వేరే వుందని తెలిసింది. పవన్ మాట్లాడిన మాటల స్క్రిప్ట్ అంతా దర్శకుడు త్రివిక్రమ్ రాసిచ్చేదేనట.
సినిమాకు మరి కాస్త హైప్ తెచ్చి, మరో కాసిన్ని రోజులు హడావుడి వుండేలా చూసేందుకు వీలుగా ఆయన ఈ స్పీచ్ రాసినట్లు తెలుస్తోంది. నిజానికి పైరసీ బయటపడిన నాటి నుంచీ ఈ ఇద్దరి మధ్య దాని విషయమై ఇదే తరహా సంభాషణలు సాగినట్లు, వాటినే ప్రసంగంగా తన దైన స్టయిల్ లో మలిచినట్లు తెలుస్తుది.
అంతకు ముందు మా టీవీలో పవన్-శ్రీనివాస్ మాట్లాడినపుడు కూడా పైరసీ పై ఇండస్ట్రీ వ్యక్తుల వ్యవహారంపై ఇదే విధంగా మాట్లాడారు. అయితే కాస్త సౌమ్యంగా. మొత్తానికి త్రివిక్రమ్ సినిమానే కాదు స్పీచ్ ను కూడా హిట్ కొట్టాడు.