దెబ్బ‌లు తిన్న సాక్షి సిబ్బందికి ఏదీ ప‌రామ‌ర్శ‌?

సొంత మీడియా ప్ర‌తినిధుల‌పై దాడులు చేసినా ప‌ల‌క‌రించే దిక్కు లేక‌పోతే, ఏ ధైర్యంతో దూకుడుగా ప‌ని చేయాలో అర్థం కావ‌డం లేద‌ని సాక్షి న్యూస్ నెట్‌వ‌ర్క్ సిబ్బంది ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వైసీపీ కోసం దెబ్బ‌లు తిన్న త‌మ‌కు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నుంచి క‌నీస ప‌రామ‌ర్శ‌, ఓదార్పు లేద‌ని సాక్షి న్యూస్ నెట్‌వ‌ర్క్ వాపోతోంది. ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్ పులివెందుల‌లో ప‌ర్య‌టించారు. సోష‌ల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టార‌ని పోలీసుల విచార‌ణ ఎదుర్కొంటున్న ప‌వ‌న్‌కుమార్ అనే కార్య‌క‌ర్త‌ను జ‌గ‌న్‌తో వైసీపీ నాయ‌కులు క‌లిపించారు. “నిన్ను విచారించే డీఎస్పీతోనే మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే సెల్యూట్ కొట్టిస్తా” అని ప‌వ‌న్‌కు జ‌గ‌న్ భరోసా ఇచ్చారు. ఇంత వ‌ర‌కూ బాగానే వుంది.

వైఎస్ జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని వేముల‌లో సాక్షి చానెల్ ప్ర‌తినిధి, అలాగే కెమెరామన్‌పై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. తీవ్రంగా కొట్ట‌డంతో గాయాల‌పాల‌య్యారు. వైసీపీ కోసం దెబ్బ‌లు తిన్న వాళ్ల‌కు క‌నీస ప‌రామ‌ర్శ కూడా క‌రువైంది. ఇలాగైతే వైసీపీ కోసం ఎలా ప‌ని చేయాల‌నే ఆవేద‌న‌తో కూడిన ప్ర‌శ్న‌… సాక్షి న్యూస్ నెట్‌వ‌ర్క్ నుంచి వ‌స్తోంది. తాము ఏమైనా బానిస‌ల‌మా? అని వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు.

సొంత మీడియా ప్ర‌తినిధుల‌పై దాడులు చేసినా ప‌ల‌క‌రించే దిక్కు లేక‌పోతే, ఏ ధైర్యంతో దూకుడుగా ప‌ని చేయాలో అర్థం కావ‌డం లేద‌ని సాక్షి న్యూస్ నెట్‌వ‌ర్క్ సిబ్బంది ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డం, కూట‌మి స‌ర్కార్ కేసుల‌తో బెద‌ర‌గొడుతున్న నేప‌థ్యంలో ప‌ని చేయ‌డం త‌మ‌కు క‌త్తిమీద సాముగా మారింద‌ని సాక్షి న్యూస్ నెట్‌వ‌ర్క్ అంటోంది. ఇలాంటి త‌రుణంలో యాజ‌మాన్యం నుంచి నామ‌మాత్రంగా కూడా భ‌రోసా ల‌భించ‌డం లేద‌ని అంటున్నారు.

ఇందుకు వేముల‌లో సాక్షి చానెల్ ప్ర‌తినిధి, కెమెరామ‌న్‌పై దాడి, అనంత‌ర ప‌రిణామాలే నిద‌ర్శ‌నంగా చూపుతున్నారు. ఇదే ప్ర‌త్య‌ర్థి మీడియా వాళ్ల‌కు ఏదైనా జ‌రిగితే, టీడీపీ, దాని మిత్ర ప‌క్షాలు కాకుల్లా వాలిపోతున్నార‌ని గుర్తు చేస్తున్నారు. ఇప్ప‌టికైనా వైఎస్ జ‌గ‌న్ త‌న కోసం ప‌ని చేసే వాళ్ల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని వాళ్లు అభ్య‌ర్థిస్తున్నారు.

14 Replies to “దెబ్బ‌లు తిన్న సాక్షి సిబ్బందికి ఏదీ ప‌రామ‌ర్శ‌?”

  1. సాక్షి వాళ్ళకి జీతాలు ఇవ్వడమే ఎక్కువ అని అన్న భావన…ఎందుకంటె సాక్షి లో వచ్చేవి అన్నీ నమ్మకూడదు అని అసెంబ్లీ లోనే చెప్పాడు

  2. అన్నకి సరి అయినా మోటివేషన్ లేనిదే ఏ పని చెయ్యడు…. ఒక్క శవం కూడా లేకుండా పరామర్శ అంటే ఎలా….

  3. ఒక నిందితుడికి డి.యస్.పి తోనే సెల్యూట్ చేయిస్తాననటం భరోసా అనరు GA ! దానిని బరితెగింపు అంటారు.

  4. సొంత తల్లి , చెల్లి నీ తరిమేసి నా ఆ పంది పెంట తినే వెధవ కోసం పనిచేయడమే మీ దరద్రం.పైగా ఆ కొం*కిస్క గాడు వచి మిమిలిని పలకరించాల , బానిసల కి ఇలాంటి కోరికలు వుండకూడదు.

Comments are closed.