15 ఏళ్లు క‌లిసి వుంటామంటూనే.. క‌ల‌హాల కాపురం!

పైకి మాత్రం చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాలునీళ్ల‌లా క‌లిసిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నారు. కానీ ఒక‌రిని, మ‌రొక‌రు న‌మ్మే ప‌రిస్థితి లేదు.

ఇంకా 15 ఏళ్ల పాటు చంద్ర‌బాబుతో క‌లిసి రాజ‌కీయ ప్ర‌యాణం సాగిస్తాన‌ని డిప్యూటీ సీఎం, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే చెబుతుంటారు. మ‌రోవైపు కూట‌మిలో పైకి క‌నిపించ‌ని క‌ల‌హాలు ఉన్న‌ట్టు… వాళ్ల వ్య‌వ‌హారాలు చెబుతుంటాయి. రెండురోజుల పాటు క‌లెక్ట‌ర్లతో ప్ర‌భుత్వం స‌ద‌స్సు నిర్వ‌హించింది. ఈ స‌ద‌స్సులో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌నిపించ‌లేదు. అంత‌కు ముందు, నిర్వ‌హించిన స‌ద‌స్సులో మాత్రం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నీ తానై దిశానిర్దేశం చేశారు.

ఇప్పుడేమో ఆయ‌న ఆచూకీ లేక‌పోవ‌డంతో చ‌ర్చ‌కు తెర‌లేచింది. కూట‌మిలో అస‌లేం జ‌రుగుతోంద‌ని వాళ్ల‌లో వాళ్లే మాట్లాడుకునే ప‌రిస్థితి. టీడీపీతో సంబంధం లేకుండా త‌న అన్న నాగ‌బాబును జ‌న‌సేన ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌న అన్న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌ద్ద‌ని, కేవ‌లం కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తే చాల‌ని చంద్ర‌బాబుతో ప‌వ‌న్ అన్న‌ట్టు టీడీపీ అనుకూల మీడియా రాసింది. అదే రోజు పంతం ప‌ట్టి మ‌రీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న అన్న‌ను నామినేష‌న్ వేయ‌డానికి సిద్ధం కావాల‌ని ఆదేశించ‌డం… కూట‌మిలో ఏదో జ‌రుగుతుంద‌నే ఆలోచ‌న‌కు బీజం వేసింది.

అలాగే పిఠాపురంలో రోజురోజుకూ టీడీపీ-జ‌న‌సేన మ‌ధ్య య‌వ్వారం ర‌చ్చ‌కు దారి తీస్తోంది. ప‌వ‌న్ గెలుపులో టీడీపీ పాత్రే లేద‌న్న‌ట్టు జ‌న‌సేన నాయ‌కుడు నాగ‌బాబు మాట్లాడ్డం… ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక‌పోతున్నాయి. దీంతో తాడోపేడో తేల్చుకోవాల‌నే వ‌ర‌కూ పిఠాపురంలో రాజ‌కీయం న‌డుస్తోంది. వాట‌ర్‌ప్లాంట్ ఓపెనింగ్‌కు వ‌ర్మ‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డంతో జ‌న‌సేన‌తో టీడీపీ కార్య‌క‌ర్త‌లు గొడ‌వ‌ప‌డ్డారు. ప‌ర‌స్ప‌రం నెట్టుకునే వ‌ర‌కూ నిన్న వెళ్లారు.

ఈ ప‌రిణామాల‌న్నీ చూడ‌డానికి చిన్న‌విగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ, రోజులు గ‌డిచేకొద్ది స‌రిదిద్ద‌డానికి వీల్లేని స్థాయికి చేరుకుంటాయి. మొగ్గ‌ద‌శ‌లోనే విభేదాల్ని పరిష్క‌రించుకోవాల‌ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు అనుకోవ‌డం లేదు. పిఠాపురంలో వ‌ర్మ‌ను ప‌రోక్షంగా టీడీపీ ఎగోస్తోంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు జ‌న‌సేన నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. వ‌ర్మ కూడా ఈ ద‌ఫా తానేంటో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రుచి చూపించాల‌నే క‌సితో జ‌నంలోకి వెళుతున్నారు.

అయితే పైకి మాత్రం చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాలునీళ్ల‌లా క‌లిసిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నారు. కానీ ఒక‌రిని, మ‌రొక‌రు న‌మ్మే ప‌రిస్థితి లేదు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రాజ‌కీయ నిబ‌ద్ధ‌త లేద‌ని, ఆయ‌న ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చెప్ప‌లేమ‌ని, అందుకే మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం వుండాల‌ని టీడీపీ నేత‌ల భావ‌న‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సుకు ఎందుకు వెళ్ల‌లేదో బ‌ల‌మైన కార‌ణం చెప్ప‌రు. ఇదే అని కాదు, అనారోగ్య‌మంటూ ఒక్కోసారి కేబినెట్ స‌మావేశానికి కూడా ఆయ‌న వెళ్ల‌రు. మ‌రోవైపు స‌నాత‌న ధ‌ర్మం అంటూ ద‌క్షిణాది రాష్ట్రాల్లోని ఆల‌యాల సంద‌ర్శ‌న‌కు వెళ్తుంటారు. కూట‌మిలో అస‌లేం జ‌రుగుతున్న‌దో వాళ్ల‌కే తెలియాలి.

16 Replies to “15 ఏళ్లు క‌లిసి వుంటామంటూనే.. క‌ల‌హాల కాపురం!”

  1. ఏ కాపురంలో అయినా కలహాలు ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎన్నాళ్ళు కలిసి ఉంటారు అనేది, CBN గారు, PK గారు matured individuals, confident that they can gracefully handle these petty issues, if any, so నువ్వేమి సంబరపడ అక్కర్లేదురా GA!!

  2. పాపం నాలుగు రోజులకు ఒకసారి కలహాలు అని నువ్వు చించుకోవడం, వాళ్ళు కలిసిమెలిసి కనిపించడం నువ్వు పిసుక్కోవడం రొటీన్ అయిపొయింది. ఒకసారి కలహాలు అన్నవ్, వెంటనే పవన్ 15ఏళ్ళు కలిసి ఉంటాం అన్నాడు. ఇంకోసారి చంద్రబాబు కి పవన్ దొరకడం లేదు అన్నావ్, పవన్ ఎన్టీఆర్ ట్రస్ట్ ముసిచల్ నైట్ కి 50 లక్షలు ఇచ్చాడు.

  3. బాబ్బాబు.. టీడీపీ తో పొత్తు తెంచుకుంటే, ఈజన్మకి MLA గా గెలవడం ఇదే last.

    కానీ

    నీతో కాపురం చేయట్లేదని, మీ నాలుగో A1పెళ్ళాన్ని మాత్రం వదిలించుకోవద్దు ప్లీజ్ ప్లీజ్..

    ముందు ముందు సర్ది చెప్పి కాపురానికి పంపించే భాద్యత మాది..

  4. Sarle, nuvvu happy ne gaa.!!

    pottu unte nastam yevariki , lekapothe yevariki labham andedi kootamiki telusu ..yekkuvagaa aasa pettukoku GA .

    Give Respect – Get Respect from each other – this is the kootami policy

  5. మన కంపెనీకి ఇద్దరే clientlu అని బ్రహ్మానందం డైలాగు ఉంది…. అలా మనకి ఉన్నదీ రెండే వార్తలు అనుకుంట….ఒకటి నాగబాబుకు ఎమ్మెల్సీ వద్దు అని టీడీపీ మీడియా అన్నారు అయినా పవన్ ఇప్పించాడు, రెండు జనసేన సభ లో నాగబాబు గారు వర్మ గారిని వారి కర్మ అన్నాడు…. ఈ రెండు బేస్ చేసుకుని 200 సార్లు రాసారు…. ఇంకా రాస్తూనే ఉన్నారు…. కూటమిలో గొడవలు అంటే కేవలం పిఠాపురం వర్మ, నాగబాబు యేనా…. రాష్ట్రంలో 175 నియోజిక వర్గాలు, ఇవి కాక క్యాడర్, నాయకులూ, అధినాయకత్వం, పాలిసీలు వారి మధ్య బేధాభిప్రాయాలు ఇవి చెప్పాలి కానీ నిద్ర లేస్తే మన ఆలోచన పిఠాపురం వర్మ గారి స్థాయిని ధాటి బయటకి రావట్లేదు….

  6. ఎన్కటి !

    సింగల్ సింహం అంటూ మీ అన్నని మునగ చెట్టు ఎక్కించి మింగించే బదులు పొత్తులు ఎలా పెట్టుకోవాలి కలిసి ఎలా ఉండాలో చంద్రాన్ని , పావనని చూసి నేర్చుకోమని చెప్పు.

      1. రాహుల్ గాంధీ అంటే మోడీకి భయం, అందుకే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాడు కదా.

      2. అంతేగా .. పూర్తి రాక్షస సంహారం జరగాలి కదా ! అందుకే వైసీపీ నాయకులలో గుబులు మొదలైందట. జగన్ బలముగా కనిపించినంత వరకు కూటమి గా వుంటారు, వాళ్ళు కూటమిగా వున్నంతవరకు వైసీపీ గెలవదు. అందుకే వైసీపీ లో ఉంటే ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు అని డిసైడ్ అయ్యి పక్క చూపులు చూస్తున్నారు.

  7. ఎన్నికల ముందు ఓడ మల్లన్న ఎన్నికల తర్వాత బోడి మల్లన్న అన్నట్టు వుంది పిఠాపురం లొ నాగబాబు పవన్ ల వ్యవహారం శైలి. ఐనా పచ్చ party జెండా మోసే 15ఏళ్ల బానిస బతుకు బతికే బదులు party ని tdp లొ విలీనం చేస్తే మంచిది

Comments are closed.