ప్ర‌జాప్ర‌తినిధుల అవినీతిపై ఆరా తీయండి బాబూ!

పాల‌కుల తీరును అసుస‌రించే అధికారులు అవినీతి లేదా నీతిమంతంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

అధికారుల అవినీతిపై కూట‌మి స‌ర్కార్ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్ర‌జాభిప్రాయాల్ని సేక‌రిస్తోంది. మీ ప‌రిధిలో ఫ‌లానా శాఖలో అవినీతి వుంటే 1, లేదంటే 2 నొక్కండి అని ఆ కాల్స్ ద్వారా కోరుతున్నారు. అయితే పాల‌కుల తీరును అసుస‌రించే అధికారులు అవినీతి లేదా నీతిమంతంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. త‌మ‌ను దొంగ‌ల్లా ప్ర‌భుత్వం చూడ‌డంపై అధికారుల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

మీ ఎమ్మెల్యేలు, మంత్రులే ఎక్క‌డ చూసినా దోపిడీలు, దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ముందు వాళ్ల గురించి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్ర‌జాభిప్రాయాల్ని సేక‌రించాల‌ని ఉద్యోగులు మండిప‌డుతున్నారు. ప్ర‌జ‌ల నుంచి కూడా ఇదే ర‌క‌మైన అభిప్రాయం వ్య‌క్తం కావ‌డం విశేషం. కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలా చెల‌రేగిపోతున్నారో మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ పెద్ద‌లు నిలువ‌రించ‌లేని ద‌య‌నీయ స్థితిలో ఉన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా విచ్చ‌ల‌విడిత‌నం పెరిగిపోతోంది. చిన్న ప‌ని కావాల‌న్నా క‌ప్పం క‌ట్టాల్సిన దుస్థితి. లేదంటే ఏ ప‌నీ ముందుకు సాగ‌ని వైనం. అధికార పార్టీ నేత‌ల్ని కాద‌ని, తాము ఏ ప‌నీ చేయ‌లేని ప‌రిస్థితి వుంద‌ని, ముందు త‌మ ఇంటిని చ‌క్క‌దిద్దుకోవాల‌ని అధికారులు అంటున్నారు.

మంచి జ‌రిగితే పాల‌కుల గొప్ప‌, చెడు అయితే అధికారుల‌పై నింద వేయ‌డం అల‌వాటైంద‌ని వారు మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఐవీఆర్ఎస్ కాల్స్‌పై అధికారుల్లో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. త‌మ‌తో త‌ప్పులు చేయించేది పాల‌కులే, మ‌ళ్లీ అభిప్రాయాల్ని సేక‌రించేది కూడా వాళ్లే కావ‌డం వింతగా వుంద‌ని అంటున్నారు.

5 Replies to “ప్ర‌జాప్ర‌తినిధుల అవినీతిపై ఆరా తీయండి బాబూ!”

  1. ఆరా తీస్తున్నారు! మరి ఆరా తెస్తె నువ్వు ఎడుస్తున్నవ్…

    .

    విడుదల రజని ఒ వ్యపారి నుండి ఎలా 2 కొట్లు బెదిరించి తీసుకుంది,

    సాక్షి కి ఎలా 500 కొట్లు దొచి పెట్టింది

    పెద్ది రెడ్డి ఎలా భూములు ఆక్రమించుకుంది,

    గుట్క నాని ఎలా పెదల స్తాలాల మెరక పెరుతొ కొట్లు దొంగలించింది,

    లిక్కర్ స్కాం లొ ఎలా వెల కొట్లు కొట్టెసింది,

    బెదిరించి వెల కొట్ల విలువ చెసె కాకినాడ పొర్ట్/SEZ తమ పెరున రాయించుకుంది

    ఆన్ని భయటకి వస్తున్నాయి. ఎందుకు నీకు దొందరా?

  2. ఆరా తీస్తున్నారు! మరి ఆరా తెస్తె నువ్వు ఎడుస్తున్నవ్…

    .

    విడుదల రజని ఒ వ్యపారి నుండి ఎలా 2 కొట్లు బెదిరించి తీసుకుంది…

    సాక్షి కి ఎలా 500 కొట్లు దొచి పెట్టింది…

    పెద్ది రెడ్డి ఎలా భూములు ఆక్రమించుకుంది…

    గుట్క నాని ఎలా పెదల స్తాలాల మెరక పెరుతొ కొట్లు దొంగలించింది…

    లిక్కర్ స్కాం లొ ఎలా వెల కొట్లు కొట్టెసింది…

    బెదిరించి వెల కొట్ల విలువ చెసె కాకినాడ పొర్ట్/SEZ తమ పెరున రాయించుకుంది…

    ఆన్ని భయటకి వస్తున్నాయి. ఎందుకు నీకు తొందరా…

  3. ఇంకా నయం skill scam లొ దోషులు ఎవరు అని సర్వే చేయటం లేదు వ్యవస్థలను rbk సచివాలయం, నాశనం చేసి, liquor sand sales govt. Control నుంచి తీసేసి ఇప్పుడు విచ్చాలవిడిగా sand belt shops ప్రతి పనికి %తీసుకొంటూ తో దోచుకు తింటున్నారు

Comments are closed.