క‌డ‌ప గ‌డ్డ …జ‌గ‌న్ అడ్డానే!

క‌డ‌ప అడ్డా …జ‌గ‌న్ అడ్డా అని మ‌రోసారి రుజువైంది. క‌డ‌ప జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ స్థానాన్ని వైసీపీ నిలుపుకుంది.

క‌డ‌ప అడ్డా …జ‌గ‌న్ అడ్డా అని మ‌రోసారి రుజువైంది. క‌డ‌ప జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ స్థానాన్ని వైసీపీ నిలుపుకుంది. క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ స్థానాన్ని ద‌క్కించుకోవాల‌ని, వీలుకాక‌పోతే ఎన్నిక‌ను వాయిదా వేయాల‌ని టీడీపీ వ్యూహం ర‌చించింది. జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయ‌ని, దీంతో చైర్మ‌న్ అభ్య‌ర్థి బ‌రిలో ఉన్న త‌న‌కు న‌ష్టం వ‌స్తుందంటూ గోప‌వ‌రం టీడీపీ స‌భ్యుడు జ‌య‌రామ్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే హైకోర్టులో టీడీపీ స‌భ్యుడి ప‌న్నాగం పార‌లేదు. ఎన్నిక‌ను వాయిదా వేసేందుకు ఏపీ హైకోర్టు స‌సేమిరా అంది.

దీంతో జెడ్పీ చైర్మ‌న్ ఎన్నిక బ‌రి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు టీడీపీ వైఎస్సార్ క‌డ‌ప జిల్లా అధ్య‌క్షుడు ఆర్‌.శ్రీ‌నివాస్‌రెడ్డి ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. క‌డ‌ప జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా బీ.మ‌ఠం జెడ్పీటీసీ స‌భ్యుడు రామ‌గోవింద‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్టు క‌లెక్ట‌ర్ చెరుకూరి శ్రీ‌ధ‌ర్ ప్ర‌క‌టించారు. అనంత‌రం ఆయ‌న‌తో క‌లెక్ట‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. క‌డ‌ప‌లో జెడ్పీ చైర్మ‌న్ స్థానాన్ని కైవ‌శం చేసుకోవ‌డం ద్వారా జ‌గ‌న్‌ను సొంత జిల్లాలో దెబ్బ కొట్టాల‌న్న ప్ర‌య‌త్నాలు విఫ‌లం కావ‌డం టీడీపీకి తీవ్ర నిరాశ క‌లిగించాయి.

42 మంది జెడ్పీటీసీ స‌భ్యులు వైసీపీ వైపు గ‌ట్టిగా నిల‌బ‌డ‌డం విశేషం. కూట‌మి అప‌రిమిత‌మైన అధికారంతో వుంది. అనేక ప్ర‌లోభాలకు గురి చేసిన‌ప్ప‌టికీ కేవ‌లం ఐదుగురు మాత్ర‌మే, కూట‌మి వైపు వెళ్లారు. మిగిలిన వాళ్లంతా వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంపై త‌మ న‌మ్మ‌కాన్ని క‌న‌బ‌రిచారు. సుదీర్ఘ‌కాలంగా క‌డ‌ప అంటే వైఎస్సార్ కుటుంబం అడ్డా అనే పేరు వుంది.

అయితే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీకి జ‌గ‌న్ సొంత జిల్లాలో ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ ప‌ది నెల‌ల కూట‌మి పాల‌న‌… జెడ్పీటీసీ స‌భ్యుల్ని త‌మ వైపు తిప్పుకోలేక‌పోయింది. త‌ద్వారా క‌డ‌ప గ‌డ్డ‌…జ‌గ‌న్ త‌న అడ్డానే అని జెడ్పీ చైర్మ‌న్ గిరిని నిలుపుకోవ‌డం ద్వారా నిరూపించుకున్నారు.

21 Replies to “క‌డ‌ప గ‌డ్డ …జ‌గ‌న్ అడ్డానే!”

  1. 142 మంది ఎమ్మెల్యేలు తగ్గిపోయే…. ప్రతిపక్ష హోదా కూడా లేకపాయ….కాబినెట్ హోదా పాయె…. మండలిలో రాజ్యసభలో ఒకొక్కరిగా తగ్గిపోయే…. కుడి చెయ్యి లాంటి విజయ సాయి గారు కూడా పాయె…. ఐప్యాక్ పాయె….అన్న దగ్గర తల్లి, చెల్లి కూడా లేకపాయ…. అన్నీ పోయినా కడప జిల్లా పరిషద్ ఉన్నదీ నీ పులి గాండ్రింపులు ఏమాయె అన్నో అన్నా….

  2. స్వాతంత్రం వచ్చినప్పుటినుండి పులివెందులని ఈడి తాత, తాత తర్వాత అబ్బ, అబ్బ తర్వాత ఈడు ఇలా ఒకరితర్వాత ఒకరు ఏళ్లుగా ప్రజలని భయపెట్టి మీరే ఎలుతున్నారు కదరా.. కానీ ఇంతవరకు ఒక్క డ్యామ్ కట్టడం కానీ, కాలువ తవ్వి కనీసం ఒక్క ఎకరాకి నీళ్లు ఇవ్వలేదు కదరా.. తూ

    పులివెందులకి ఈడీ అచీవ్మెంట్ ఏందయ్యా అంటే??.

    చెబితే మీరు నవ్వుతారు.. అందుకే “చెప్పను బ్రదర్”

      1. emito develop chesindi cheppali , adigithe kuppam antaru , mari enduku

        l 1 1 ne win cheyali ? cbn ne win chesthe saripotundi kada

        difference emiti ??

        kooli batuku aa

    1. కుప్పంలో ఉన్నన్ని లంజల కొంపలు… ఇంకెక్కడన్నా ఉన్నాయా…. అదిరా అభివృద్ధి…. అంతే కానీ అమ్మఒడి…. నాడు…. నేడు… కాదు

    1. ఈ గ్రేట్ ఆంధ్ర గాడికి సిగ్గు లజ్జ లేని మాటలు మాట్లాడతాడు, అసలు స్థానిక సంస్థ ఎన్నికలలో టిడిపి పోటీనే చేయలేదు, అంటే ఇప్పుడు ఉన్నవన్నీ వాళ్ళవే, వాళ్ల సీట్లే వాళ్ళు కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు, దీంట్లో టీడీపీకి పోయేదీలేదు, ఒకవేళ వచ్చిన అది బోనస్ మాత్రమే

Comments are closed.