ఎమ్బీయస్‍: జగనూ – జైలు బ్రెడ్డూ

అమెరికాలో విచారణ ప్రారంభమైతే, యీ లంచాలు యిచ్చినట్లు దాని వద్ద ఏ ఆధారాలు వున్నాయో బయటకు వస్తాయి. అప్పటిదాకా అంతా గెస్ గేమే!

నేను మద్రాసులో పని చేసే రోజుల్లో నాటక, సినీ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ గారింటికి తరచుగా వెళ్లి ఆయన కబుర్లు వినేవాణ్ని. ఆయన మంచి మాటకారి కూడా. వింటూంటే చిరునవ్వు ఉబికి వస్తూ ఉండేది. ఆయన తండ్రి ‘‘హాస్యబ్రహ్మ’’ బిరుదాంకితులు భమిడిపాటి కామేశ్వరరావు గారు నాటకాలూ, నాటికలూ, వ్యాసాలూ చాలా రాశారు. ఆయనా మంచి వ్యంగ్యంతో మాట్లాడేవారట. ఓ రోజు రాధాకృష్ణ చెప్పారు – ‘నేను ఒకసారి యింట్లో డబ్బులు కొట్టేసి, సినిమా చూడ్డానికి వెళ్లాను. మా నాన్నగారికి తెలిసిపోయింది. కొట్టలేదు, తిట్టలేదు. ఓపిగ్గా భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రొజెక్షన్ వేసి చూపించారు. ‘ఇవాళ దొంగతనంగా సినిమాకు వెళ్లావు. ఇలా నాలుగు సార్లు వెళితే గేటు దగ్గర వాడు నీకు బాగా స్నేహమవుతాడు. ‘ఇంట్లోంచి డబ్బు కొట్టుకుని రా, టిక్కెట్టు కొనవద్దులే, ఆ డబ్బులో సగం నీకు, సగం నాకు’ అంటాడు.

నువ్వు యిది మహ బాగుంది అనుకుంటావు. వాడి దగ్గర బీడీలు తాగడం నేర్చుకుంటావు. ఖర్చు పెరుగుతుంది. ఇంట్లోంచి డబ్బు కొట్టేయడం ఎక్కువౌతుంది. ఖర్చులు చాలవు, పక్కింటి వాళ్ల యిళ్లలో కూడా చోరీలు మొదలు పెడతావు. ఇలా దొంగవై పోతావు, ఎప్పుడో ఒక రోజు పట్టుబడతావు, జైల్లో పడేస్తారు…’ అని యిలా అల్లుకుంటూ వెళ్లారట. ‘చివరకి జైల్లో కూడు తినే మట్టి చిప్ప విరిగిపోకుండా ఎక్కడ దాచుకోవాలో జాగ్రత్తలు కూడా చెప్పేసేరండి.’ అని రాధాకృష్ణ గారు చెప్పుకుని వచ్చారు. ఆయన చెప్పే తీరులో ఉన్న సొగసు కారణంగా 35 ఏళ్లు దాటినా నాకు యీ ఉదంతం గుర్తుండి పోయింది. హాస్య రచయిత కాబట్టి ఉత్ప్రేక్షలు, అతిశయోక్తులు ఉంటాయిలే, నిజజీవితంలో యింత లాంగ్ ప్రొజెక్షన్ ఎవరు వేస్తారు? అనుకున్నాను.

కానీ అదానీ-జగన్ విషయంలో మీడియా చూపించిన ఫ్లాష్ ఫార్వార్డ్ తర్వాత ఏదీ అసాధ్యం కాదని తెలిసి వచ్చింది. అదానీపై అమెరికా క్రిమినల్ కేసు పెట్టింది అనగానే జగన్ అప్పటికే అమెరికా జైల్లో పడిపోయి నేపథ్యంలో ‘చెఱసాల పాలైనావా సంబరాల రాంబాబూ’ నేపథ్యపు పాట వింటాడా లేదా? పొద్దుటి బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ పెడితే జగన్ ఏం చేస్తాడు? అనే దానిపై కార్టూన్లు వచ్చేశాయి. బ్రెడ్‌తో పాటు బట్టర్ యిస్తారా, జామ్ యిస్తారా? అనే దానిపై ఒపీనియన్ పోల్ నిర్వహించారేమో కూడా. ‘నీ అక్రమాలు యిక్కడే అనుకున్నా, అమెరికా దాకా విస్తరించావా, అన్నా’ అంటూ శర్మిల ఆక్రోశాలు కూడా విన్నాం. ఇప్పుడు దాని గురించి ఎవరూ కుయ్‌కయ్ మనటం లేదు. మరి అప్పుడు మాత్రం జగన్ అదానీతో ఫలానా రోజున సమావేశమయ్యాడు, అప్పుడే లంచం తీసుకున్నాడు, అమెరికా జైలుకి వెళ్లడం ఖాయం అంటూ కథనాలు వండి వార్చేశారు. దానికి వ్యతిరేకంగా సందేహాలు వెలిబుచ్చిన వారి మాటలు కొట్టి పడేశారు. ఇదీ మన తెలుగు మీడియా స్టాండర్డ్!

నల్లమోతు చక్రవర్తి అనే ఒకప్పటి ఎన్నారై ఎబిఎన్ టీవీకి వచ్చి మాట్లాడుతూంటారు. ఎవరికి అనుకూలమో వేరే చెప్పనక్కరలేదు. ఆయన యీ కేసు విషయంలో ‘అమెరికాలో చట్టాల సంగతి నాకు తెలుసు, యీ కేసులో జగన్ అక్కడి జైలుకి వెళ్లడు.’ అన్నారు. ఇక వెంకట కృష్ణ హతాశుడై పోయారు. పానెల్‌లో తక్కినవాళ్లందరూ ముక్తకంఠంతో అమెరికా జైలు ఖాయం అని బృందగానం చేస్తూ ఉంటే యీయన యిలా అంటాడేమిట్రా అని ‘యూ టూ బ్రూటస్’ అనే లుక్కిచ్చి ఇక మళ్లీ ఆయన్ని మాట్లాడించలేదు అవేళ. భారతదేశపు జైలుకి జగన్ మళ్లీ వెళ్లడం ఖాయం, అతని స్థానంలో ముఖ్యమంత్రిగా భారతి కూర్చుంటారా లేదా అనే విషయంపై గత ఐదేళ్లగా చాలా డిస్కషన్స్ జరిగాయి. అదానీ కేసు వచ్చాక యిక ఫారిన్ జైలు ప్రాప్తి కూడా నిశ్చయం అని కథలు చెలరేగాయి.

నేను మాత్రం ఈ కేసు బయటకు రాగానే ఏమీ కాదని ముందే అనుకున్నాను. అదానీ వద్ద జగన్ లంచం తీసుకోలేదని నేనేమీ అనుకోలేదు, ఆంధ్రజ్యోతి చెప్పినట్లు 2021 సెప్టెంబరు 12న అదానీని జగన్ కలిసినా, లంచం యిచ్చినా, అది యీ డీల్‌కి సంబంధించినది మాత్రమే అనీ అనుకోలేదు. అదానీతో మన దేశ ముఖ్యమంత్రులలో చాలామందికి చాలా లావాదేవీలు ఉన్నాయనీ, వాటిలో భాగంగా ఎప్పుడైనా, ఎంతైనా డబ్బు చేతులు మారి వుండవచ్చనీ నా ఊహ. మరి యిది ఓ కొలిక్కి రాదని ఎందుకనుకున్నాను అంటే అదానీతో ముడిపడిన కేసు కాబట్టి! చిన్నపిల్లలు ఆడే ఒక ఆటలో ఎవరైనా పిల్లాడు అవతలివాడు పట్టుకునే లోపున ‘అమ్మ’ అనే ఓ కారెక్టరును ముట్టుకుంటే యిక వాడు ఔట్ అవ్వడు. ప్రస్తుతం బిజెపి అమ్మలగన్న యమ్మ. ఎవరైనా ఆమె కొంగుచాటుకి వస్తే చాలు, పట్టుబడడమనే ప్రశ్నే రాదు. సర్వపాపాలూ హరించుకుని పోతాయి. కేసులన్నీ వీగిపోతాయి, లేదా ఏళ్ల తరబడి సా…గిపోతాయి.

ఈ సూక్ష్మం అర్థం కాగానే యితర పార్టీల వారందరూ బిజెపిలోకి దూకేస్తున్నారు. ఇప్పుడున్న బిజెపి వారిలో కనీసం 40% మంది వరకు యితర పార్టీల్లోంచి వచ్చినవారే! ముఖ్యంగా కాంగ్రెసు వారు! ఇలాటి పరిస్థితుల్లో బిజెపి అధినాయకుడికి అత్యంత ఆత్మీయుడైన అదానీతో (మోదీకి ముందు అదానే గ్రోత్ గ్రాఫ్, తర్వాతి గ్రోత్ గ్రాఫ్ పోల్చి చూస్తే విశదంగా తెలుస్తుంది) పాటు సహ నిందితుడైన వ్యక్తికి యిమ్యూనిటీ రావడంలో ఆశ్చర్యమేముంది? ఏదో కాస్సేపు అడావుడి జరుగుతుంది, తర్వాత అంతా చల్లారుతుంది అనుకున్నాను. అదే జరిగింది. జగన్ తక్కిన కేసుల మాట ఎలా వున్నా, దీనిలో కేంద్రం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ యిన్వాల్వ్ అయి ఉంది. అప్పుడూ, యిప్పుడూ కేంద్రంలో ఉన్నది ఒకే ప్రభుత్వం. ఇక దానిలో గోల్‌మాల్ జరిగిందని ఎలా అంటుంది? అమెరికా అంటే అనవచ్చు. దాని చట్టాలు, దాని ఆరోపణలు, దాని గోల దానిది.

ఇంతకీ కేసేమిటి? భారత ప్రభుత్వపు న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ క్రింద పని చేసే ‘సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎస్‌ఇసిఐ – సెకీ) అనే పబ్లిక్ సెక్టార్ కంపెనీ రాష్ట్రాల విద్యుత్ సరఫరా సంస్థ (డిస్కమ్‌)లకు సౌర విద్యుత్ సరఫరా చేయడానికై ప్రయివేటు విద్యుత్ ఉత్పాదనా సంస్థల నుంచి 12 వేల మెగావాట్లకు టెండర్లను ఆహ్వానించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ (8000 మెగావాట్లు) అజ్యూర్ పవర్ (4000 మెగావాట్లు) సంస్థలు కలిసి ఆ టెండర్లు దక్కించు కున్నాయి. వాటి దగ్గర్నుంచి కొన్న విద్యుత్‌ను సెకీ డిస్కమ్‌లకు అమ్మబోతే అమ్మో అంత ధర పెట్టి కొనలేం అనేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అప్పుడు అదానీ రంగంలోకి దిగి ‘మీరు సెకీ ద్వారా విద్యుత్ కొంటామని ఒప్పందాలు చేసుకోండి, అప్పుడే వాళ్లు మా దగ్గర కొనుక్కుని మాకు డబ్బులిస్తారు’ అని ప్రభుత్వాధినేతలను 2021 ఆగస్టులో ఒప్పించాడు. ఆ ఒప్పించే క్రమంలో లంచాలిచ్చాడు – అనేది అమెరికా వారి ఎస్‌ఇసి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్) అభియోగం.

ఇలా ఒప్పించిన రాష్ట్రాలు 4 – ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్లస్ యుటి – జమ్మూ అండ్ కశ్మీర్! ఈ రాష్ట్రాల ‘అఫీషియల్స్’కు చెల్లించిన, లేదా చెల్లిస్తానని ఒప్పుకున్న మొత్తం 265 మిలియన్ డాలర్లు (2022 ఏప్రిల్ నాటికి రూ. 2029 కోట్లు). దీనిలో సింహభాగమైన (86%) 228 మిలియన్ డాలర్లు (రూ.1750 కోట్లు) ఆంధ్ర ప్రదేశ్‌లో 2019-24 మధ్య ఉన్న హయ్యర్ అఫీషియల్‌కు యిచ్చారు అని కేసు. జగన్ పేరు రాయలేదు కానీ, టాప్ అఫీషియల్ అన్నారు. ముఖ్యమంత్రిని అఫీషియల్‌గా వ్యవహరిస్తారా? మన ఇండియాలో అయితే అలా అనరు. అమెరికాలో కాంగ్రెసు మెంబర్స్‌ను వాళ్లనూ ‘ఎలక్టెడ్ అఫీషియల్స్’ అంటారు. ఆ పదాన్నే యిక్కడ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాడారా? అలా ఎందుకు వాడడం? కేసు పెట్టేటప్పుడు మొహమాటాలెందుకు? నువ్వు ఫలానావాడికి లంచం యిచ్చావని మా దగ్గర సాక్ష్యం ఉంది, అని డైరక్టుగా ఆరోపించవచ్చుగా! రాష్ట్రంలో ముఖ్యమంత్రి హయ్యస్ట్ అఫీషియల్ అవుతాడు కానీ ఉత్తి హయ్యర్ కాడు కదా!

లంచంలో 86% ఆంధ్రలోనే యివ్వడానికి కారణమేమిటి? మొత్తం సప్లయిలో 86% అక్కడే కొన్నారా? లేదే! అంకెలు చూద్దాం మొత్తం 12000 మెగావాట్లు. మెగావాట్‌కు రూ.25 లక్షల చొప్పున లంచం చొప్పున ఆంధ్రకు 7000 మెగావాట్లకు రూ.1750 కోట్లు యిచ్చారట. తక్కిన 5000 మెగావాట్లకు కలిపి రూ. 279 కోట్లు మాత్రమే యిచ్చారట? అంటే మెగావాట్‌కి 5.5 లక్షలన్నమాట! అంత చీప్‌గా యిస్తే వాళ్లెందుకు ఒప్పుకున్నారు? ఈ ఒప్పందాలు జరిగినప్పుడు కశ్మీర్ కేంద్రం అజమాయిషీలోనే ఉంది కాబట్టి, అదానీ బిజెపికి క్లోజ్ కాబట్టి అక్కడ లంచం యివ్వవలసిన పని బడలేదు అనుకుందాం. మరి తక్కిన మూడు రాష్ట్రాలను ప్రతిపక్ష పార్టీయే ఏలుతోంది కదా! వాళ్లందరినీ 279 కోట్లలో చుట్టబెట్టేశారా? ఆ మూడూ ఒకే పార్టీ చేతిలో లేవు. మూడు వేర్వేరు పార్టీలు ఏలుతున్నాయి. బిజెడిలో అవినీతి తక్కువ అనుకున్నా, కాంగ్రెసు, డిఎంకెలు అవినీతికి పేరుపడిన పార్టీలు. అందువలన యీ అంకెలు యిల్లాజికల్. ఆమెరికన్ ప్రాసిక్యూషన్ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.

సరే, ఒక భారతీయ పారిశ్రామికవేత్త తన విద్యుత్‌ను సెకీ ద్వారా అమ్ముకోవడానికి భారతీయ రాజకీయ నాయకులకు లంచం యిచ్చాడు. దీనిలో అమెరికాకు నొప్పేమిటి? ఈ విద్యుత్ ఉత్పత్తి, అమ్మకాలకై నిధులు సేకరించడానికై అదానీ గ్రూపు (అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా దానిలో భాగం) వివిధ దేశాల యిన్వెస్టర్లకు బాండ్స్ అమ్మింది. వాటిలో అమెరికా ఒకటి. 2021 ఆగస్టు-సెప్టెంబరులలో 750 మిలియన్ డాలర్లు సేకరిస్తే వాటిలో 175 మిలియన్ డాలర్లు అమెరికా పౌరుల నుంచి, బ్యాంకుల నుంచి సేకరించింది. పౌరుల ప్రయోజనాలు కాపాడడానికై యీ కంపెనీలు చట్టబద్ధంగా, నీతివంతంగా ప్రవర్తించేట్లు అమెరికా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. అమెరికాలోని విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్‌సిపిఏ 1977) చట్టం ప్రకారం తన వ్యాపారాభివృద్ధికై ఏదైనా కంపెనీ అమెరికాలోనే కాదు, వేరే ఏ దేశంలోనైనా సరే లంచం యిచ్చినట్లు తెలిస్తే శిక్షార్హం.

తన సౌర విద్యుత్‌ను సెకీ ద్వారా అమ్మించడానికై అదానీ గ్రూపు భారతదేశంలో ప్రభుత్వాధినేతలకు లంచం యిచ్చినట్లు తమ విచారణలో తేలింది కాబట్టి, కంపెనీ అధినేతలైన గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై అమెరికా ప్రభుత్వపు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ అఁడ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ కేసులు పెట్టాయి. ఇప్పుడీ చట్టాన్ని మారుద్దామని ట్రంప్ ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే వాళ్లకు అడుగడుగునా పోటీకి వచ్చే చైనాలో యిలాటి చట్టం లేదు. చైనీస్ కంపెనీలు విదేశాల్లో ఎవడికి లంచాలిచ్చి కాంట్రాక్టులు తెచ్చుకున్నా చైనాకు అభ్యంతరం లేదు. అందుకని చైనా కంపెనీలు విదేశాల్లో దూసుకుపోతున్నాయి. కానీ అమెరికా లోని యీ చట్టం కారణంగా అమెరికన్ కంపెనీలకే కాకుండా, అమెరికాలో నిధులు సేకరించిన యితర దేశాల కంపెనీలకూ (ప్రస్తుతం అదానీ) కాళ్లకు బందాలు వేసినట్లయి చైనా కంపెనీలతో పోటీ పడలేని స్థితిలో ఉన్నాయి. అందుకని ఎక్కడా లంచాలివ్వకూడదనే చాదస్తాలు, పట్టింపులు పెట్టుకోకుండా అమెరికన్ కంపెనీలను ఎలాగోలా ఎదగండి చాలు అని ట్రంప్ ప్రోత్సహించదలిచాడు. చట్టం అమలుకు కొత్త మార్గదర్శకాలను తీసుకురావాలని అటార్నీ జనరల్ పామ్ బోండీని ఆదేశించాడు. ప్రస్తుతానికైతే చట్టం ఉంది కాబట్టి కేసు నడుస్తోంది. దీనితో పాటు తమపై కేసులు ఉన్న సమాచారాన్ని అదానీ గ్రూపు దాచిందన్న అభియోగాలు కూడా ఉన్నాయి. వాటిపై కూడా కేసు నడుస్తుంది.

గతంలో టిడిపి కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలను మార్కెట్లో రేటు కంటె రెండున్నర రెట్లు ఎక్కువ పెట్టి రూ. 6.99 రేటుకి కొన్నారని చెప్పి, ఏకపక్షంగా రద్దు చేసి, కోర్టు ఆదేశాలకు మేరకు ఆ కంపెనీలకు ఉత్తి పుణ్యాన వందలాది కోట్లు అప్పగించిన జగన్ సెకీతో యూనిట్ రూ.2.49 ధరకు 25 ఏళ్ల ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారు? జ్యోతి దీనిపై రాస్తూ 3 పాయింట్లు చెప్పింది. 1) దేశంలో ఏ రాష్ట్రమూ యింత ధర చెల్లించలేదు 2) అప్పట్లో 2 రూ.లకు రేటు పడిపోయే అవకాశాలున్నాయని, అయినా హెచ్చు రేటుకి 25 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు 3) ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీలు (ఐఎస్‌టిఎస్) ఉండవని జగన్ చెప్పినా, యూనిట్‌కు 80 పైసలు కట్టాల్సిందే అని సెకీ యిప్పుడు చెప్తోంది, యీ భారం రూ. 42 వేల కోట్లు.

మొదటి పాయింటుకి వస్తే ఆంధ్ర ఒప్పందం కుదుర్చుకునే నాటికి మరో ప్రభుత్వ సంస్థ ఎన్‌టిపిసి 2.79 రేటు (ట్రేడింగ్ మార్జిన్‌తో కలిపి) కోట్ చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో యింకా ఎక్కువ ఉంది. పోనీ సెకీ యితర రాష్ట్రాలకు యింతకంటె తక్కువకు యిచ్చిందా? ఆ ఏడాది సెకీ కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు గూగుల్‌లో ఉన్నాయి. ఆంధ్రతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే కశ్మీర్‌లో రూ.2.61కి అమ్మింది, పోనీ అదేదో దూరప్రాంతం, పర్వతప్రాంతం అనుకుంటే ఆంధ్రకు పొరుగున ఉన్న తమిళనాడుకీ రూ.2.61 చొప్పున అమ్మింది. ఛత్తీస్‌గఢ్‌కి రూ. 2.54 చొప్పున అమ్మింది. ఒక్క ఒడిశాకు మాత్రమే ఆంధ్రతో సమానంగా రూ.2.49 చొప్పున అమ్మింది. మరి జగన్ హెచ్చు రేటు పెట్టి కొన్నాడని ఎలా అంటారు? ఎల్1 (లోయస్ట్) టెండరును పక్కన పెట్టి, ఎల్‌2 ని ఆమోదిస్తే ‘అదిగో, లంచం తీసుకుని ప్రభుత్వాన్ని నష్టపరిచాడు’ అనవచ్చు.ఈ రాష్ట్రాల రేట్లు దాచిన జ్యోతి గుజరాత్‌కు సెకీ రూ.1.99కే యిచ్చిందని మాత్రం రాసింది. గుజరాత్, రాజస్థాన్‌లలో ఎండ తీవ్రత ఎక్కువ కాబట్టి, ఉత్పత్తి చేసేది సౌర విద్యుత్తు కాబట్టి, తక్కిన చోట కంటె యూనిట్ రేటు 60-70 పైసలు తక్కువ ఉండే అవకాశం ఉంది. ఆ సౌలభ్యం లేదు కాబట్టే, తక్కిన చోట్ల ఆ రేట్లు పెట్టి కొన్నారు. ఈ విషయాలు జ్యోతి చెప్పలేదు.

రెండో పాయింటు – అప్పట్లో 2 రూ.లకు రేటు పడిపోయే అవకాశాలున్నాయని జ్యోతి రాసినది ఏ మేరకు నిజం? ప్రస్తుతం సెకీ ఏ రేటుకి అమ్ముతోందని గూగుల్ చేసి చూశాను. ఇటీవలే 2000 మె(గా)వా(ట్లు) రూ.3.52 రేటు చొప్పున అమ్మిందట. ఇటీవలి టారిఫ్స్ అంటూ రూ.3.06కి 600 మెవా, 3.04 చొప్పున 250 మెవా అమ్మిందంటూ వివరాలు యిచ్చారు. అసలు అది కొనే రేటెంత? 2024 మార్చిలో సెకీ టెండర్లు పిలిస్తే సప్లయర్స్ ఆఫర్ చేసిన రేట్లు గూగుల్‌లో ఉన్నాయి. జెఎస్‌డబ్ల్యు, మరో రెండు కంపెనీలు 1250 మెవా రూ.2.56 చొప్పున, ఎన్‌టిపిసి 250 మెవా రూ.2.57 చొప్పున యిస్తామని ఆఫర్ చేశాయి. ఈ న్యూస్ 2024 అక్టోబరులో, జ్యోతిలో వార్త వచ్చేందుకు నెల ముందు వచ్చింది. 2024లో కొనడమే రూ.2.56కి కొంటున్నపుడు, 2021లోనే 2 రూ.లకు అమ్ముతుందని జ్యోతి ఎలా అనుకుంది? అప్పట్లో సెకీ 1070 మెవాకు టెండర్ పిలవగా యూనిట్ రూ.2కి కుదిరింది. దానికి కారణం ఉత్పత్తి కేంద్రం రాజస్థాన్‌లోనే ఏర్పాటు కావడం! ఆంధ్ర కూడా రాజస్థాన్‌లా ఎడారి అవుతూనే రూ.2 రేటు సాధ్యమనే విషయాన్ని జ్యోతి దాచింది.

ఇక మూడో పాయింటు – ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీలు (ఐఎస్‌టిఎస్) ఉండవని జగన్ చెప్పినా, యూనిట్‌కు 80 పైసలు కట్టాల్సిందే అని సెకీ యిప్పుడు చెప్తోందనీ యీ భారం రూ. 42 వేల కోట్లనీ ఆంధ్రజ్యోతి నవంబరు 22న రాసింది. సరిగ్గా మూడు నెలలు గడిచేసరికి చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎపిఈఆర్‌సి (విద్యుత్ నియంత్రణ మండలి) ఒప్పందంలో ఎలాటి లోపాలు లేవని తేల్చింది. 2025-26లో 4000 మెగావాట్లను తీసుకుంటున్నామని చెప్పింది. ఐఎస్‌టిఎస్ చార్జీలుగా యూనిట్‌కు 80 పైసలు అడుగుతోందని ఈఆర్‌సి చెప్పలేదు. జ్యోతికి ఎవరు చెప్పారో! ట్రేడింగ్ మార్జిన్ కింద సెకి యూనిట్‌కు 7 పైసలు అదనంగా అడిగిందని, సెంట్రల్ ఈఆర్‌సి దాన్ని ఆమోదించిందని, అందుచేత తాము ఏమీ వ్యాఖ్యానించమని ఈఆర్‌సి చెప్పింది.

సెకీ ఫైలు 7 గంటల్లోనే ఆమోదం పొందిందంటూ ఈనాడు రాయగానే వైసిపిలోంచి జనసేనలోకి గెంతిన బాలినేని విద్యుత్ మంత్రిగా తన చేత ఆదరాబాదరాగా సంతకాలు చేయించారని చెప్పుకున్నారు. సెకీ లేఖకు, ఒప్పందానికి మధ్య రెండున్నర నెలల సమయం పట్టిందని తారీకులు చెప్తున్నాయి. ఇప్పుడీ ఒప్పందం భేషుగ్గా ఉందని కూటమి సర్కారు సర్టిఫై చేశాక, బాలినేని దానికి క్రెడిట్ తీసుకుంటారా? కేసు విషయానికి వస్తే ప్రస్తుతానికైతే అమెరికన్ ఎస్‌ఇసి అదానీపై సమన్లు జారీ చేసి భారత ప్రభుత్వానికి పంపింది. కేంద్ర లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 25న వాటిని అహ్మదాబాదులోని సెషన్స్ కోర్టుకి ఫార్వార్డ్ చేసి, ఆ ఊళ్లో వున్న అదానీకి సర్వ్ చేయమని కోరింది. కోర్టు సర్వ్ చేసిందో లేదో యింకా తెలియదు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, అమెరికన్ ఎస్‌ఇసి, జగన్‌కి కానీ, యితర రాష్ట్రాలలోని, కశ్మీర్‌లోని ‘అఫీషియల్స్’కి కానీ సమన్లు పంపలేదు. ఎందుకు? వారి చట్టప్రకారం ఆ లంచం తీసుకున్నవారు నేరస్తులు కాదు. ఇచ్చిన అదానీయే నేరస్తుడు. అమెరికాలో ఋణాలు సేకరించి, తన వ్యాపారాభివృద్ధికై యితర దేశాల్లో లంచం యివ్వడమే అతను చేసిన నేరం. ఇక అలాటప్పుడు జగన్‌పై అమెరికా కేసు పెట్టడం కానీ, అమెరికా జైల్లో జగన్ కూర్చోవడం కానీ జరిగే పని కాదు. కానీ మన తెలుగు మీడియా కథలు అల్లేసింది.

అమెరికాలో విచారణ ప్రారంభమైతే, యీ లంచాలు యిచ్చినట్లు దాని వద్ద ఏ ఆధారాలు వున్నాయో బయటకు వస్తాయి. అప్పటిదాకా అంతా గెస్ గేమే! అదానీ గ్రూపుపై అనేక దేశాల్లో ఆరోపణలున్నాయి. కానీ యీ సెకీ ఒప్పందం కేసులో లంచం చేతులు మారిందని నిరూపించడం కష్టమైన పని. ఎందుకంటే అదానీ రాష్ట్ర ప్రభుత్వంతో డైరక్టుగా కుదుర్చుకుంటే అనుమానాలకు తావు ఉంటుంది. కానీ యిది కేంద్ర సంస్థకు, రాష్ట్ర డిస్కమ్‌కు జరిగిన ఒప్పందం. పైగా ఆ రేటు కంటె తక్కువకి యిస్తానని మరే యితర సంస్థ ముందుకు రాలేదు. రేటుతో బాటు సెకీ అనేక యితర కన్సెషన్లు యిచ్చింది. వాటిపై యిప్పటికీ వెనక్కి పోలేదు. సెకీ హెచ్చు రేటుకి అమ్మి వుంటే, అప్పుడు అదానీ లాభపడ్డాడన్నా, దానిలోంచి రాష్ట్రాధికారులకు లంచం యిచ్చాడన్నా అతుకుతుంది. దీనిలో అలాటి సందర్భం ఏమీ లేదు. అమెరికా ఆరోపణలు చేసినంత మాత్రాన అవన్నీ నిజం కావాలనీ, వాటికి ఆధారాలుంటాయనీ లేదు. అలా అయితే అమెరికా ప్రభుత్వం తన పౌరులపై, యితర దేశాధినేతలపై పెట్టిన కేసులన్నీ నెగ్గాలి. నెగ్గటం లేదు కదా!

2021 నవంబరులో యీ కేసు విషయం బయటకు రాగానే తెలుగు మీడియా, టిడిపి మాత్రమే జగన్ అమెరికా జైలుకి వెళ్లిపోతాడంటూ గగ్గోలు పెట్టేశాయి. పొరుగున ఉన్న తమిళనాడులో ఆ సందడే లేదు. జగన్ స్టయిల్లో, మేము అదానీతో ఒప్పందమేమీ కుదుర్చుకోలేదుగా అని డిఎంకె మంత్రి అనేశాడు. ఎడిఎంకె కూడా ఏమీ మాట్లాడలేదు. కమ్యూనిస్టులు మాత్రం అదానీపై వ్యతిరేకత కనబరుస్తూ సిబిఐ ఎంక్వయిరీ వేయాలని అడిగారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో కూడా సందడేమీ కానరాలేదు. ఒక్క తెలుగు మీడియా మాత్రమే ఎక్కడెక్కడికో వెళ్లిపోయి, ఏమేమో ఊహలు చేసేసింది. ఎన్నో కలలు అమ్మేసింది. పయ్యావుల కేశవ్ ఏమేమో మాట్లాడేశారు. ఇంతా చేసి మూణ్నెళ్ల తర్వాత అంతా భేషుగ్గా ఉందన్నారు. రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా సరేలే అనుకుంటారు. కానీ మీడియా యిలా అఘోరిస్తే ఎలా?

జగన్ జైలుకి వెళ్లడానికి అవకాశం లేని సెకీ ఒప్పందం గురించి నెల్లాళ్ల పాటు తెగ వాయించేశారు. వివాదం బయటకు రాగానే తక్కిన రాష్ట్రాలలో ఫలానా రేటుకి కొన్నారు, మార్కెట్‌లో యీ రేటు ఉంది. ఇక్కడ యీ రేటుకి కొన్నారు అని పాఠకులకు చెప్పకపోతే ఎలా? కేసు అదానీ కంపెనీ మీద పెట్టారు కానీ జగన్ మీద కానీ యితర రాష్ట్రాల ‘అఫీషియల్స్’పై కానీ పెట్టలేదు అని రాయకపోతే ఎలా? ఇందుకే తెలుగు మీడియా విశ్వసనీయత పోగొట్టుకుంది. దశాబ్దాలుగా జర్నలిజానికి, నిజాయితీకి, నిర్భీతికి చిరునామాలం అని చెప్పుకుంటూ వచ్చి, జర్నలిజం పేర ప్రభుత్వం నుంచి అనేక సౌకర్యాలు పొందుతూ వీళ్లు చేసే నిర్వాకం యిది. టిడిపి అనుకూల మీడియా యీ కథనాలు వండి వారుస్తూంటే డిఫెండ్ చేసుకోవలసిన ‘‘సాక్షి’’ ఎంతసేపటికీ బాబు హయాంలో యింతకంటె హెచ్చు రేటుకి ఒప్పందం జరిగిందని, 2021లో సెకీయే మంచి టెర్మ్‌స్‌తో చక్కటి రేటు ఆఫర్ చేసిందని, కేంద్రమే సిఫార్సు చేసిందని, ఒప్పందం వలన రాష్ట్రానికి మేలు కలిగిందని వాదిస్తూనే వచ్చింది తప్ప, తక్కిన రాష్ట్రాలు యిక్కడి కంటె ఎక్కువ రేటుకి కొన్నాయని, ప్రస్తుతం సెకీ రేట్లు యీ తీరున ఉన్నాయని కానీ రాయలేదు. అంతేకాదు, కొనుగోళ్లలో ఆంధ్ర వాటా 58% మాత్రమే ఉండగా లంచాల మొత్తంలో మాత్రం 86% ఎలా యిస్తారన్నా లాజిక్కూ, అదానీకు సమన్లు జారీ చేసిన అమెరికా ఎస్‌ఇసి జగన్‌కు ఎందుకు చేయలేదన్నా లాజిక్కూ లాగలేదు.

అంటే అక్కడి జర్నలిస్టుల సామర్థ్యమూ అంత గొప్పగా ఉందన్నమాట. ఒకవేళ వాళ్లు రాసి ఉంటే, అది నా దృష్టికి వచ్చి ఉండకపోతే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటాను. అదొకటే కాదు, పై వ్యాసంలో నేను రాసిన అంకెల్లో తప్పులున్నా, అవగాహనాలోపమున్నా చెప్తే సవరించుకుంటాను. మీరు జర్నలిస్టు అయి వుండి… జర్నలిస్టులపై యిలా రావడం భావ్యమా? అని రాయకండి. నేను జర్నలిస్టును కాను, సామాన్య పాఠకుణ్ని. ఏ రిపోర్టర్లు, ఏ సమాచారసేకరణా సౌలభ్యాలు, ఏ ‘అభిజ్ఞవర్గాలు’ లేనివాణ్ని. వార్తా పత్రికలు, మాగజైన్లు చదివి జ్ఞానాన్ని పెంచుకుందామని చూసేవాణ్ని. అందువలన పత్రికల స్టాండర్డ్‌పై, ఎథిక్స్‌పై ఆందోళన చెందుతూంటాను. అందుకే యీ ఆవేదన.

– ఎమ్బీయస్ ప్రసాద్

mbsprasad@gmail.com

73 Replies to “ఎమ్బీయస్‍: జగనూ – జైలు బ్రెడ్డూ”

  1. పాత బురద కొత్తగా ఎత్తుకోడానికి ఎంతో..అందరకీ ఈ మడిసి మీద అంత కక్షఎందుకో..ఉన్నత కులంలో పుట్టి ఉన్నతంగానే ఆలోచన చేసేవాడిమీద ఇలా బజారుసరుకుమాటలు ఎలా?

  2. సర్ మీకు అర్థం అయినట్టే ప్రజలు అందరికి తెలుసు ఈ కేసు లొ ఆదాని వున్నాడు కాబట్టి జగన్ గారికి ఏమి కాదు అని. అదే సంగతి మీరు చెప్పిన మీడియా కు ఇంకా బాగా తెలుసు.

    కానీ జగన్ ఎంత అవినీతి పరుడో చెప్పడం మాత్రం వాళ్ళ ఉద్దేశ్యం. అది బాగా నెరవేరింది. మీతో సహా ప్రజలు అందరు లంచం విషయమ్ లొ మాత్రం ఎటవంటి శషబిషాలు లేవు.

  3. అందరు మర్చి పోతే మీరు ఎందుకు ఇప్పడు బయటికి తవ్వడం .. రాజకీయాలు అంటే అలానే ఉంటాయి .. చిన్న సందు దొరికిన పెద్దది చేస్తారు .. ఇంతకీ మీరు నరసురా రక్త చరిత మీద ఇలానే ఏదైనా వ్యాసం రాశారా ? రాస్తే లింక్ షేర్ చేయండి ప్లీజ్ . .

    1. ఆ హత్య జరగగానే రాశాను. తర్వాత అనేకసార్లు అలా అనడం తప్పని రాశాను. మీరు ఆ తేదీలకు వెళ్లి ఆర్కయివ్స్‌లో చెక్ చేసుకోండి. లేదా వివేకా హంతకుడు వెక్కిరిస్తున్నాడు అని టైటిల్ టైప్ చేసి గూగుల్‌లో వెతకండి.

  4. తెలుగు పేపర్ విశ్వసనీయత కోల్పోయింది సరే , ఇంగ్లేష్ పేపర్లు కూడా అదే రాసాయిగా , అవి కూడా విశ్వసనీయత కోల్పోయాయా.

    కోర్ట్ శిక్ష వేయలేదు అనే పాయింట్ అనవసరం. 2g స్కాములో నీరా రాడియా టేపులే సాక్ష్యం కాదు అని హైకోర్టు కోటేశాక విశ్వసనీయత కోల్పోయింది కోర్టులు తప్ప మీడియా కాదు.

    అసలు తేల్చాల్సిన విషయం అవినీతి జరిగిందా లేదా, జరిగింది అని రాసాక కోర్ట్ శిక్ష వెయ్యకపోతే ప్రజలే శిక్ష వేస్తారు. నిజమైన విశ్వసనీయత కోల్పోయేది అసలు పాయింట్ వదిలేసి కోర్ట్ లు శిక్షించలేదు అనే పాయింట్ మీద వంటకాలు వండేవాళ్లు

    1. వాళ్ళు భాషలో చెప్పాలంటే సాక్షి, గ్రేట్ ఆంధ్రా మాత్రమే నీతి నిజాయితీ గా పనిచేస్తున్నాయి అని ప్రచారం చేస్తున్నారు

  5. //గుజరాత్ రాజస్థాన్ లలో ఎండ తీవ్రత ఎక్కువ కాబట్టి//

    ఆంధ్రాలో ప్రత్యేకించి రాయలసీమలో, తమిళనాడులో ఎండలు లేవా? గోరంట్ల మాధవ్ లాంటివారు ఎవరైనా సూర్యుడికి మూతిని అడ్డం పెట్టారా? ఇంకొక విషయం సౌర పలకలు విద్యుదుత్పత్తి చేయడానికి మరీ తీవ్రమైన ఎండ అవసరం లేదు

    1. మన దగ్గర గాలిలో వేడి ఎంత ఉంటుందో, గుజరాత్, రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో ఎంత ఉంటుందో ఆ అంకెలు కూడా చూశాను. మరీ టెక్నికల్ అని వాటిని యివ్వలేదు. బండలు వేరు, ఎడారి నేల వేరు

      1. సౌర విద్యుదుత్పత్తి జరిగేది వెలుతురు వల్ల, వేడి వల్ల కాదు. ఇంకా చెప్పాలంటే వేడి పెరిగేకొద్దీ పలకల పనితీరు మందగిస్తుంది. అందులో ఉండే సిలికా పొరలు వేడెక్కితే అనుకున్నంత విద్యుత్ ఉత్పత్తి కాదు. రోజుకి ఎన్ని గంటలు అంతరాయం, మేఘాలు లేని వెలుతురు ఉంటుంది అనేది ప్రధానం, ఎంత ఉష్ణోగ్రత ఉంది అని కాదు. ఎక్కడో గుజరాత్, రాజస్థాన్ లో పెట్టే కంటే ఎక్కడ ఆ విద్యుత్ ని వాడతారో అక్కడ పలకలు పెట్టడం ఉత్తమం, ట్రాన్స్మిషన్ చార్జీలు తగ్గుతాయి, ఒక్క సౌర పలకలు అనే కాదు, బొగ్గు ఆధారిత కేంద్రాలకు కూడా ఇది వర్తిస్తుంది. భద్రాద్రి, యాదాద్రి కేంద్రాలకు కూడా ఇదే ఆరోపణ ఉన్నది.

  6. “తెలుగు మీడియా విశ్వసనీయత కోల్పోతుంది”..

    ఎవరి target audience కి తగ్గట్లు, ఎవరి political inclinations కి తగినట్లు వాళ్లు రాస్తారు…మీతో సహా.. నాలుగు పేపర్లు చదివితే truth always lies somewhere in between అనుకుని సరిపెట్టుకోవటమే తప్ప ఇక్కడ ఎవరూ సుద్ద పూసలు లేరు.

    మీరు గతం సిబిఐ చీఫ్ అలోక్ వర్మ, రాకేష్ ఆస్థాన ల మధ్య వివాదం మీద ఆర్టికల్ రాస్తూ 2002 లొ అసలు సబర్మతి ఎక్స్‌ప్రెస్ మీద దాడే జరగలేదని, భోగీ లోపలే నిప్పు అంటుకుందని సుప్రీంకోర్ట్ జడ్జ్ బెనర్జీ నివేదిక లో తేలిందని రాసుకొచ్చారు. అప్పట్లో నేను కామెంట్ కూడా పెట్టాను. అసలు బెనర్జీ రిటైర్డ్ జడ్జ్ అని.. అది లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి గా ఉండి 2005 బీహార్ ఎన్నికల ముందు ముస్లిం వర్గాన్ని ప్రసన్నం చేసుకోటానికి అప్పటికప్పుడు వేసిన కమీషన్ రిపోర్ట్ అని..ఆ రిపోర్ట్ ని చివాట్లు పెడుతూ సుప్రింకోర్ట్ కొట్టి పారేసినా తమరు దాన్నే ఉదహరించి, స్వయం గా సుప్రింకోర్ట్ వేసిన నానావతీ కమీషన్ విషయాలని విస్మరించి పాఠకులని తప్పుదోవ పట్టించటం లో ఆంతర్యాన్ని ప్రశ్నించాను. ఇది ఒక ఉదాహరణే. ఇలాంటివి అనేకం. జర్నలిజం లో నిజాయితి వెతుక్కోవటం అంటే గొంగట్లో తింటూ బొచ్చు రాకూడని అనుకోవటమే.

    అంతెందుకు.. మీరు ఎప్పుడూ టిడిపి అనుకూల పత్రికలు రాసిన వాటిపైనే విశ్లేషణ చేస్తారు కాని జగన్ అనుకూల మీడియా రాసే వాటిపై చెయ్యరు. ఎవరైనా ప్రశ్నిస్తే.. నేనేమి రాయాలో నా హక్కు అంటారు. అలానే మీరు ఎటువంటి ‘రాతగాళ్లో నిర్ణయించే హక్కు పాఠకులకి ఉంది. ఆ ముక్క చెప్తే ఉడుక్కుని కామెంట్లు డిలీట్ చేసుకుంటారు. దాని వల్ల ప్రయోజనం ఏంటో

  7. “తెలుగు మీడియా విశ్వసనీయత కోల్పోతుంది”..

    ఎవరి target audience కి తగ్గట్లు, ఎవరి political inclinations కి తగినట్లు వాళ్లు రాస్తారు…మీతో సహా.. నాలుగు పేపర్లు చదివితే truth always lies somewhere in between అనుకుని సరిపెట్టుకోవటమే తప్ప ఇక్కడ ఎవరూ సుద్ద పూసలు లేరు.

    మీరు గతం సిబిఐ చీఫ్ అలోక్ వర్మ, రాకేష్ ఆస్థాన ల మధ్య వివాదం మీద ఆ!ర్టికల్ రాస్తూ 2002 లొ అసలు సబర్మతి ఎక్స్‌ప్రెస్ మీద దాడే జరగలేదని, భోగీ లోపలే నిప్పు అంటుకుందని సుప్రీంకోర్ట్ జడ్జ్ బెనర్జీ నివేదిక లో తేలిందని రాసుకొచ్చారు. అప్పట్లో నేను కామెంట్ కూడా పెట్టాను. అసలు బెనర్జీ రిటైర్డ్ జడ్జ్ అని.. అది లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి గా ఉండి 2005 బీహార్ ఎన్నికల ముందు ముస్లిం వర్గాన్ని ప్రసన్నం చేసుకోటానికి అప్పటికప్పుడు వేసిన కమీషన్ రిపోర్ట్ అని..ఆ రిపోర్ట్ ని చివాట్లు పెడుతూ సుప్రింకోర్ట్ కొట్టి పారేసినా తమరు దాన్నే ఉదహరించి, స్వయం గా సుప్రింకోర్ట్ వేసిన నానావతీ కమీషన్ విషయాలని విస్మరించి పాఠకులని తప్పుదోవ పట్టించటం లో ఆంతర్యాన్ని ప్రశ్నించాను. ఇది ఒక ఉదాహరణే. ఇలాంటివి అనేకం. జర్నలిజం లో నిజాయితి వెతుక్కోవటం అంటే గొంగట్లో తింటూ బొ!చ్చు రాకూడని అనుకోవటమే.

    అంతెందుకు.. మీరు ఎప్పుడూ టిడిపి అనుకూల పత్రికలు రాసిన వాటిపైనే విశ్లేషణ చేస్తారు కాని జగన్ అనుకూల మీడియా రాసే వాటిపై చెయ్యరు. ఎవరైనా ప్రశ్నిస్తే.. నేనేమి రాయాలో నా హక్కు అంటారు. అలానే మీరు ఎటువంటి ‘రాతగాళ్లో నిర్ణయించే హక్కు పాఠకులకి ఉంది. ఆ ముక్క చెప్తే ఉడుక్కుని కామెంట్లు డిలీట్ చేసుకుంటారు. దాని వల్ల ప్రయోజనం ఏంటో

  8. “తెలుగు మీడియా విశ్వసనీయత కోల్పోతుంది”..

    ఎవరి target audience కి తగ్గట్లు, ఎవరి political inclinations కి తగినట్లు వాళ్లు రాస్తారు…మీతో సహా.. నాలుగు పేపర్లు చదివితే truth always lies somewhere in between అనుకుని సరిపెట్టుకోవటమే తప్ప ఇక్కడ ఎవరూ సుద్ద పూసలు లేరు.

    మీరు గతం సిబిఐ చీఫ్ అలోక్ వర్మ, రాకేష్ ఆస్థాన ల మధ్య వివాదం మీద ఆ!ర్టికల్ రాస్తూ 2002 లొ అసలు సబర్మతి ఎక్స్‌ప్రెస్ మీద దాడే జరగలేదని, భోగీ లోపలే నిప్పు అంటుకుందని సుప్రీంకో!ర్ట్ జ!డ్జ్ బెనర్జీ నివేదిక లో తేలిందని రాసుకొచ్చారు. అప్పట్లో నేను కామెంట్ కూడా పెట్టాను. అసలు బెనర్జీ రిటైర్డ్ జడ్జ్ అని.. అది లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి గా ఉండి 2005 బీహార్ ఎన్నికల ముందు ము!స్లిం వర్గాన్ని ప్రసన్నం చేసుకోటానికి అప్పటికప్పుడు వేసిన కమీషన్ రిపోర్ట్ అని..ఆ రిపోర్ట్ ని చివాట్లు పెడుతూ సుప్రింకోర్ట్ కొట్టి పారేసినా తమరు దాన్నే ఉదహరించి, స్వయం గా సుప్రింకో!ర్ట్ వేసిన నానావతీ కమీషన్ విషయాలని విస్మరించి పా!ఠకులని తప్పుదోవ పట్టించటం లో ఆంతర్యాన్ని ప్రశ్నించాను. ఇది ఒక ఉదాహరణే. ఇలాంటివి అనేకం. జర్నలిజం లో నిజాయితి వెతుక్కోవటం అంటే గొంగట్లో తింటూ బొ!చ్చు రాకూడని అనుకోవటమే.

    అంతెందుకు.. మీరు ఎప్పుడూ టిడిపి అనుకూల పత్రికలు రాసిన వాటిపైనే విశ్లేషణ చేస్తారు కాని జగ!న్ అనుకూల మీడియా రాసే వాటిపై చెయ్యరు. ఎవరైనా ప్రశ్నిస్తే.. నేనేమి రాయాలో నా హక్కు అంటారు. అలానే మీరు ఎటువంటి ‘రాతగాళ్లో’ నిర్ణయించే హక్కు పాఠకులకి ఉంది. ఆ ముక్క చెప్తే ఉడుక్కుని కా!మెంట్లు డి!లీట్ చేసుకుంటారు. దాని వల్ల ప్రయోజనం ఏంటో

  9. “తెలుగు మీడియా విశ్వసనీయత కోల్పోతుంది”..

    ఎవరి target audience కి తగ్గట్లు, ఎవరి political inclinations కి తగినట్లు వాళ్లు రాస్తారు…మీతో సహా.. నాలుగు పేపర్లు చదివితే truth always lies somewhere in between అనుకుని సరిపెట్టుకోవటమే తప్ప ఇక్కడ ఎవరూ సుద్ద పూసలు లేరు.

  10. “You too, Brutus?” అంటే అర్ధం మీకు తెలీదా? నువ్వు కూడా అనే అర్ధంలో వాడరు. నువ్వు కూడానా అని దాని భావం.

    ఈ తరపు పాఠకులకి దగ్గర కావాలని, అతకని, కుదరని, సందర్భశుద్ధి లేని ప్రయోగాలు అనేకానేకం చేస్తూ ఉంటారు. వీటిని మాత్రం సరిచూసుకుని వాడండి.

  11. “You too, Brutus?” అంటే అర్ధం మీకు తెలీదా? నువ్వు కూడా అనే అర్ధంలో వాడరు. నువ్వు కూడానా అని దాని భావం.

    ఈ తరపు పాఠకులకి దగ్గర కావాలని, అతకని, కుదరని, సందర్భశుద్ధి లేని ప్రయోగాలు అనేకానేకం చేస్తూ ఉంటారు. వీటిని మాత్రం సరిచూసుకుని వాడండి.

  12. new technology drives prices down. comparing to 5 years ago and saying Jagan saved money is intellectual dash dash.

    I strongly believe Jagan took 1700 crore bribe by signing that agreement which helped Adani…

  13. ఇంకో విషయం ఏమిటంటే …ఆంధ్ర లో అసెంబ్లీ స్థానాలు 175 కాబట్టి 1,750 కోట్లు…( ఒక్కొక్క స్థానానికి 10 కోట్ల చొప్పున )…అదే 225 ఉంటే, ఆ సంఖ్య 2,250 కోట్లు ఉండేదేమో???

  14. సిర్ అదే చేత్తో. దేశం అంతా డిజిటల్ పేమెంట్ వాడుతుంటే ఆంధ్ర లో లిక్కర్ షాప్ లు అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న షాప్ లో ఎందుకు పెట్టలేదో. ఎందుకు బ్రాండెడ్ మద్యం ఆంధ్ర లో.లేకుండా చేశారో చిన్న.ఆర్టికల్ రాయమని నిజాలు. తెల్పమని మనవి

  15. ఈ పెద్దాయనకు జగన్ రెడ్డి మీద ఎందుకో చాలా ప్రేమ పుట్టుకొస్తుంది

  16. ఇంత పెద్ద వ్యాసం రాసిన రచయిత గారు ఆయన అసెంబ్లీ కి ఎందుకు వెళ్ళాడో అడగడు. ఎంతకూ సమర్డించటానికే ప్రాదాన్యత ఇస్తాడు. మళ్ళీ పైగా న్యూట్రల్ జర్నలిజం అంటారు.

  17. ఈ ఎదవను ఆవు గురించి రాయమన్నా మోడీ మీదా బీజేపీ మీదా అపానవాయువు వదులుతాడు. మళ్లీ తిట్టామని ఎదవ ఏడుపులు.

    వీడేదో పత్తిత్తులకు ఓటేసినట్లు. ఎదవ

  18. చాలా కష్ట పడి అన్నాయి ని సపోర్ట్ చేస్తున్నారు. నిజం గ కామెంట్స్ రాయాలంటే ఇంకో ఆర్టికల్ అవుతుంది. మీడియా తప్పు చేసింది అనే కోణం లో, అన్న సుద్దపూసా అని చెపుతున్నట్టు ఉంది

  19. nijaalu evadi ki kaavaali, neeku enta , naaku enta …nuvvu nenu manam manam dochukundaam, prajala nu tika maka petti, confuse chesi, melu chesaado mosam chesaado teliyakunda timmi ni bammi ni timmi chesi magic chesukundaam

  20. నిజమే నల్లమోతుచక్రవర్తి ఎవరికి అనుకూలమో, ప్రసాద్ గారు ఎవరికి అనుకూలమో వేరే చెప్పనక్కర్లేదు కానీ ప్రసాద్ గారి లాగానే ఆయన కూడా అప్పుడప్పుడూ నిజాలు మాట్లాడుతుంటారు. ఈ విద్యుత్ ఒప్పందం మూలంగా రాష్ట్రానికి లక్ష కోట్ల నష్టం వచ్చిందని , ఆ కుం..భ.. కో.. ణా.. న్ని వెలికి తియ్యడంలో బాబు ప్రభుత్వం విఫలమయ్యిందని ఆయన ఆయన చాలా సోషల్ మీడియా పోస్టులు పెట్టారు.

  21. నిజమే నల్లమోతుచక్రవర్తి ఎవరికి అనుకూలమో, ప్రసాద్ గారు ఎవరికి అనుకూలమో వేరే చెప్పనక్కర్లేదు కానీ ప్రసాద్ గారి లాగానే ఆయన కూడా అప్పుడప్పుడూ నిజాలు మాట్లాడుతుంటారు. ఈ విద్యుత్ ఒప్పందం మూలంగా రాష్ట్రానికి ల…క్ష కో..ట్ల నష్టం వచ్చిందని , ఆ కుం..భ.. కో.. ణా.. న్ని వెలికి తియ్యడంలో బాబు ప్రభుత్వం విఫలమయ్యిందని ఆయన ఆయన చాలా సోషల్ మీడియా పోస్టులు పెట్టారు.

    1. లక్ష కోట్ల నష్టం ఎలా వచ్చిందో ఆయన వివరించి ఉంటే, దాన్ని యిక్కడ షేర్ చేయగోర్తాను. ఆంధ్రలో లక్ష కోట్ల నష్టమైతే అంతకంటె ఎక్కువ రేటు పెట్టి కొన్న తక్కిన చోట్ల యింకెంత నష్టమో మరి

  22. ఏబీయన్ చేసిన రగడ ఉద్దేశం ప్రజల దృష్టిలో ఒకరిని జగనన్నని వి.. ల..న్ని చేయడమే కానీ ఆ చట్టాల ప్రకారం మన దేశంలొ ముఖ్యమంత్రికి ఏ విధమైన పనిష్మెంట్ ఇవ్వగలరని నేను అనుకొను. కానీ ప్రసాద్ గారు జర్నలిజంలో పడిపోతున్న విలువల గురించి ఇదే రకమైన విశ్లేషణ ఏదో ఒక రోజు సాక్షిట్ లో వచ్చిన వార్తల మీద కూడా చేస్తారని ఆశిస్తున్నాను.

    1. నారాసుర చరిత్ర అని పెట్టినపుడు, అమరావతి భూముల కుంభకోణం అంటూ ఫాంటాస్టిక్ నెంబర్లు యిచ్చినపుడు .. యిలా కొన్ని సందర్భాల్లో విమర్శించాను.

  23. ఆ రోజు ఈనాడు వచ్చిన headings చాలా onesided గా వున్నాయి. Jounalist sai గారు కూడా మీ లాగ చక్కగా విశ్లేషించారు. జగన్ filed defamation case ఆన్ ఈనాడు for its biased రిపోర్టింగ్. Hope the case will come to logical end soon and atleast helps not to publish onesided వ్యక్తిత్వం హననం చేసే stories

  24. ఎండ వేడి ఎక్కువ ఉంటే సోలార్ పవర్ ఎక్కువ ఉత్పత్తి అవదు. ఎందుకంటే సోలార్ పవర్ వేడి నుంచి కాదు, సన్ లైట్ నుంచి ఉత్పత్తి అవుతుంది. ఆ పానెల్స్ ని అందుకే ఫోటో వోల్టాయిక్ సెల్స్ అంటారు. ఇండియా లో సోలార్ రేడియేషన్ ఎక్కువ ఉన్న మొదటి ఐదు రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు.

  25. Mbs aayas ame gaani…viluv alu ani chep pukune sad aru wr iter ga aru. Kob jja ke sup port Endu ku xhes taaro..babia m urder, pink dia mond….lanti va atme eda articles rayaraaa

    1. రాసిన సందర్భం చూశారా? ప్రశ్న వేసి, దానికి ఆన్సర్ కూడా యిచ్చాను. అక్కడి చట్టం యిలా వుంది అని.

  26. సహజము గా లం*చాల అనేవి మాఫియా బాస్ లకి, రింగ్ లీడ*ర్ లకి ఇస్తారు, అతను తన ముఠా లో వాళ్ళకి పంచుతాడు, తన కమీషన్ అంటిపెట్టుకుని.

    అలాగే , అ*దానీ అనే అతని ప్రతి రాష్ట్రం లో అందరికీ ఇచే బదులు, ఇలాంటి నేరాల్లో ఆరి తేరిన జ*గన్ అనే వాడికి ఇచి,మిగతా వాళ్ళకి పంచి మన్నది ఏమో !

    అసలే, ఇండియా లో ఏ అవినీతి తీసుకున్న, అందులో జగ*న్ ము*ఠా వల్ల పేరు*లు బయటకు వచాయి. (ఢిల్లీ మద్యం కుంభకోణం..). జగ*న్ దేశం లో అన్ని నేరా*ల ము*ఠాల కి బా*స్ లాగ పని చేస్తున్నాడు ఏమో, అదేదో సినిమాలో జయప్ర*కాష్ రెడ్డి లాగ.

    కోసెయ్యం*డి, ఈ కా*మెంట్ నీ పస పస మని.

    1. అసలే ఒక హీ*రోయిన్ విషయంలో , వేరే రా*ష్ట్రానికి చెందిన బిజి*నెస్ మ్యాన్ ఆమె వలన తనకి నష్టము అనిచెప్పాడు అని,

      తాము బాని*స లామ్ కాదు ఐపి ఎస్ లమి అని మరిచిపోయి న కాంతి, ఆంజనేయులు, విశాల్ గిన్ని లాంటి IPS ల నీ వేరే రాష్ట్రానికి స్పెష*ల్ ఫ్లైట్ లో పంపి మరి ఆమెని అక్ర*మంగా అరెస్ట్ చేపించిన్ గొప్ప చ*రిత్ర జగ*న్ అనే వాడిది.

  27. మేధావిముసుగు సంకరజాతి హిందూ గాడిదకొడుకులు రాసే ఏ ఆర్టికిల్ అయినా చూడండి. వాళ్ళ కాన్సంట్రేషన్ మోడీ బొక్కల రంధ్రాన్వేషణ మీదే ఉంటుంది. మరి ఏ ఇతర నాఅయకుల అవినీతి మీద రాయరు. ఈ గాడిదకొడుకులు రాసేవి చదివితే దేశం మొత్తం మోడీ అవినీతితో నిండిపోయింది, మిగిలిన నాయకులంతా సుద్దపూసలు అనే అభిప్రాయం కలుగుతుంది

    ఈ అపానవాయువుగాడి ఈ ఆర్టికిల్ చూడండి జగన్ మీదా అదానీ మీదా రాయొచ్చు. మధ్యలో మోడీతో లింకు తగిలించాడు. ఈ ఎదవ ఎప్పుడైనా సోనియా రాహుల్ రాబర్ట్ వాద్రా ఎందుకు బెయిల్ మీద బయట ఉన్నాడో రాసాడా ?

  28. లంచం లో 86% ఇక్కడే ఇవ్వడానికి కారణం?

    బహుశా,, ఇతని ద్వారా మిగతా వాళ్ళకి లంచం వాటాలు బదలాయింపులు కోసం ఏమో. అవకాశం వింది.

    1. మన ఫ్రెండ్ తన ఏరియా లో అద్దె ఇళ్లు కోసం తిరుగుతూ వింటే, మనకి తెలిసిన మన ఏరియా రెంట్ ఏజెంట్ అతన్ని అడుగుతాం, అతనికి ఆ ఏరియా కూడా తెలుసా, తెలిస్తే సహాయం చేస్తావా అని. ఒకవేళ తెలిసి అంటే, ఇతన్నె మీ ఫ్రెండ్ కి సహాయం చేయమని కాంట్రాక్ ఇస్తాము. అదానీ కూడా ఇలాగే చేసాడు ఏమో, ఇతని ద్వారా మిగతా వాళ్ళకి వాటాలు పంవమని.

      1. శభాష్, కాంగ్రెసు వాళ్లకి, డిఎంకె వాళ్లకి, కశ్మీర్‌లో ఉన్న బిజెపి వారికి, బిజెడి వారికీ కూడా జగన్ లంచాల ఏజంటుగా పని చేస్తున్నాడంటారు! మీ ఊహ అద్భుతంగా ఉంది. దేశవిదేశాల్లో ఎన్నో వ్యవహారాలు సునాయాసంగా నడిపిస్తున్న అదానీకి యితన్నిఏజంటుగా పెట్టుకునే ఖర్మ పట్టింది పాపం. మధ్యలో యితను నొక్కేస్తాడేమోనన్న భయం వేయలేదా?

        మెంటల్‌గా ఒకదానికి ఫిక్సయిపోయి, కామన్ సెన్స్‌ను అప్లయి చేయడానికి మనసు యిచ్చగించకపోతే, యిలాటి ఊహలు ఎన్నయినా వస్తాయి

  29. మీరు లాస్ట్ పారా లో రాసిన విషయం కరెక్ట్ సర్.. జగన్ మీద మీకున్న అభిమానం చూస్తుంటే.. మీరు సామాన్య పాఠకులు మాత్రమే.., మీరు రాసిన ఆర్టికల్స్ చదువుతున్న మా పరిస్థితి ఆలోచిస్తే మా మీద మాకే అసహ్యంగా అనిపిస్తుంది .. ఒక సామాన్య పాఠకుడు ఒక అవినీతిపరుడికి, ఆర్ధిక నేరస్తుడికి సపోర్ట్ చేస్తూ రాస్తున్న ఆర్టికల్స్ చదువుతున్న మేము పాఠకులు కూడా కాదు పిచ్చివాళ్ళం

  30. సదరు సామాన్య పాఠకులు, నా కామెంట్ ను ఎందుకు డిలీట్ చేసినట్టో.. అందరి కామెంట్లకు సమాధానం చెప్పే మీకు నా కామెంట్ కి సమాధానం చెప్పే ఆలోచన బుర్రలో తట్టలేదేమో

  31. సదరు సామాన్య పాఠకులు, నా కామెంట్ ను ఎందుకు డిలీట్ చేసినట్టో.. అందరి కామెంట్లకు సమాధానం చెప్పే మీకు నా కామెంట్ కి సమాధానం చెప్పే ఆలోచన బుర్రలో తట్టలేదేమో

  32. “You too, Brutus?” అంటే అర్ధం మీకు తెలీదా? నువ్వు కూడా అనే అర్ధంలో వాడరు. నువ్వు కూడానా అని దాని భావం.

    ఈ తరపు పాఠకులకి దగ్గర కావాలని, అతకని, కుదరని, సందర్భశుద్ధి లేని ప్రయోగాలు అనేకానేకం చేస్తూ ఉంటారు. వీటిని మాత్రం సరిచూసుకుని వాడండి.

Comments are closed.