ఎన్టీఆర్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ – ఇంతటి మాస్ హీరోనీ అయోమయానికి గురి చేస్తోంది. నిజం చెప్పాలంటే శక్తి లాంటి డిజాస్టర్ చూసి కూడా తారక్ ఇంత డీలా పడలేదు. అయితే రామయ్యా ఎఫెక్ట్ కి సైడ్ ఎఫెక్టులూ తోడయ్యాయి. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలూ కొత్తవారితోనే. సంతోష్ శ్రీనివాస్ తన ఇమేజ్‌ని ఎంత వరకూ హ్యాండిల్ చేయగలడు?? అనే కంగారు పట్టుకొంది. కొరటాల శివ మీద కూడా అన్ని నమ్మకాలు పెట్టుకోవడానికి వీల్లేదు. గబ్బర్ సింగ్‌తో హరీష్ శంకర్ ఎలా అంచనాలు పెరిగాయో, మిర్చీ తరవాత కొరటాలపై కూడా అన్నే హోప్స్ ఉంటాయి. ఇవన్నీ తనకు ప్రతికూలంగా మారతాయేమో అని భయపడుతున్నాడు తారక్.
అందుకే ఓ సీనియర్‌తో, అందులోనూ తాజాగా హిట్ కొట్టిన దర్శకుడితో సినిమా చేయాలని తహతహలాడుతున్నాడు. ముందు తాను సేఫ్ జోన్లోని వెళ్లే సినిమా చేయాలి అనేది ఎన్టీఆర్ ఆలోచన. భారీ హిట్ కొట్టకపోయినా ఫర్లేదు, చిన్నదో పెద్దదో హిట్ రావాలి. అలా రావాలంటే.. స్టామినా ఉన్న దర్శకుడిని పట్టుకోవాలి. తన ముందు ఉన్న ఆప్షన్ త్రివిక్రమ్‌మాత్రమే. ఈ మాటల మాంత్రికుడితో సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. అది సెట్ కావడం లేదు. అత్తారింటికి దారేది తరవాత త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో చేస్తాడని చెప్పుకొన్నారు. కానీ త్రివిక్రమ్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. అటు వైపు రామ్ చరణ్ కూడా త్రివిక్రమ్‌తో జట్టు కట్టడానికి చూస్తున్నాడు. ఎటువైపు అడుగు వేయాలో తేల్చుకోలేని స్థితిలో ఉన్న త్రివిక్రమ్‌ని తన వైపుకు లాగే ప్రయత్నాల్లో ఉన్నాడు ఎన్టీఆర్.
మనమిద్దరం సినిమా చేద్దాం – అంటూ త్రివిక్రమ్‌ని బాగా ఇబ్బంది పెడుతున్నాడట. అయితే త్రివిక్రమ్ మాత్రం.. గబుక్కున మాట ఇవ్వలేకపోతున్నాడు. ఓ వారం రోజుల్లో త్రివిక్రమ్ కొత్త సినిమా డిటైల్స్ తెలుస్తాయి. అప్పటి వరకూ ఎన్టీఆర్‌కి టెన్షనే. మరి బుడ్డోడి కోరికను ఈ దర్శకుడు తీరుస్తాడా? లేదంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూసేలా చేస్తాడా?? ఏమో మరి..!