దీపిక పదుకోన్ తో వ్యవహారం చెడిపోయిన తర్వాత ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు రణ్వీర్ సింగ్. ఓ టెలివిజన్ టాక్ షోలో మాట్లాడిన ఈ యంగ్ హీరో.. గతంలో దీపిక అంటే తనకు బాగా ఇష్టం ఉండేదని, ప్రస్తుతం మాత్రం అలాంటి ఫీలింగ్స్ లేవంటున్నాడు. ఇంతటితో ఆగకుండా హీరోయిన్లలో “ది బెస్ట్ కిస్సర్” దీపిక మాత్రమే అంటున్నాడు.
ఒకప్పటి హాట్ హీరోయిన్ నేహా ధూపియా, టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన రణ్వీర్ సింగ్ ఈ హాట్ కామెంట్స్ చేశాడు. ముద్దులు పెట్టడంలో, మరీ ముఖ్యంగా లిప్ కిస్సులు పెట్టడంలో దీపిక పదుకోన్ ఆరితేరిపోయిందని అంటున్నాడు రణ్వీర్.
రామ్ లీలా సినిమాలో రణ్ వీర్ సింగ్-దీపిక మధ్య ఘాటు ముద్దుసీన్లు ఉన్నాయి. అయితే వెండితెరపై మీరు చూసినవి కేవలం కొన్ని మాత్రమే అంటున్నాడు రణ్వీర్. ఆ సన్నివేశాల కోసం నటించేటప్పుడు చాలాసార్లు దీపిక తనను ముద్దుపెట్టుకుందని.. ఏ హీరోయిన్ తనను అంత బాగా ముద్దాడలేదని అంటున్నాడు.
ఒకప్పుడు సీక్రెట్ లవర్స్ గా చలామణి అయ్యారు దీపిక, రణ్వీర్. తాజాగా వీళ్లిద్దరూ విడిపోయారంటూ బాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సందర్భం దొరికినప్పుడల్లా దీపికను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నాడు రణ్వీర్ సింగ్.