ప్రభాస్ సాహో: ఇది ఒక లుక్ మాత్రమే

సుజీత్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న సాహో సినిమాకు సంబంధించి ఇంకా మేకోవర్ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రభాస్ నుంచి మరో 3స్టిల్స్ బయటకొచ్చాయి. ఈ మధ్య విడుదలైన ఫొటోకు కొనసాగింపుగానే…

సుజీత్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న సాహో సినిమాకు సంబంధించి ఇంకా మేకోవర్ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రభాస్ నుంచి మరో 3స్టిల్స్ బయటకొచ్చాయి. ఈ మధ్య విడుదలైన ఫొటోకు కొనసాగింపుగానే ఇవి ఉన్నాయి తప్పితే, వీటిలో కొత్త ఎలిమెంట్ ఏం లేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ లుక్ నే సాహో కోసం ఫిక్స్ చేస్తున్నారట. అయితే సినిమాలో కేవలం ఇది ఒక యాంగిల్ మాత్రమే అని తెలుస్తోంది. కథ ప్రకారం యాక్షన్ ఎపిసోడ్స్ టైమ్ లో మరో లుక్ కూడా ఉంటుందని అంటున్నారు. ఆ లుక్ ఎలా ఉండాలో ఇంకా ఫిక్స్ చేయలేదట.

మరోవైపు సాహో సినిమాకు సంబంధించి హీరోయిన్ ను కూడా ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. చాలా మంది హీరోయిన్ల పేర్లు పరిశీలించారు. వీళ్లలో బాలీవుడ్ బ్యూటీస్ కూడా ఉన్నారు. అయితే ఫైనల్ గా యూనిట్ సభ్యులు అనుష్క వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

సాహో సినిమాకు సంబంధించి సెంట్రల్ లైబ్రరీలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. త్వరలోనే రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్ లోనే ప్రభాస్ జాయిన్ అవుతాడు. ఆ తర్వాత యూనిట్ అంతా కలిసి దుబాయ్ వెళ్తుంది.