ఇంతకాలం పారితోషికం తగ్గించుకోవడానికి అస్సలు అంగీకరించని పూరిజగన్నాథ్ ఫైనల్గా దిగొచ్చాడు. తనకి అవకాశాలు రావడమే గగనమైపోతున్న దశలో బాలకృష్ణతో చేస్తోన్న సినిమాకి జగన్ తన పారితోషికాన్ని చాలా తగ్గించుకున్నాడు. బాలకృష్ణ పారితోషికం మినహాయించి పాతిక కోట్లలో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలి పూరి.
ఆ పాతిక కోట్లలోనే తన పారితోషికంతో పాటు ఇతర టెక్నీషియన్లు, ఆర్టిస్టుల పారితోషికాలుంటాయి. అలా అని తనకో పది కోట్లు వెనకేసుకుని, పదిహేను కోట్లతో సాదాసీదాగా సినిమా చుట్టేస్తే సరిపోదు. మొత్తం విదేశీ లొకేషన్లలోనే తీస్తానని పూరి నిర్మాతకి మాట ఇచ్చాడు. క్వాలిటీ పరంగా అస్సలు కాంప్రమైజ్ అవ్వనని చెప్పాడు.
అంటే అన్నీ కలుపుకుని సినిమాకి ఇరవై కోట్ల వరకు ఖర్చయితే పూరికి అయిదు కోట్లు వస్తుందన్నమాట. తను మామూలుగా డిమాండ్ చేసే దాంట్లో ఇది సగం మాత్రమే. ఒకవేళ బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైతే అది పూరి పారితోషికం నుంచే కట్ అవుతుంది కనుక ఈ చిత్రం పూర్తయితే కానీ తనకెంత వస్తుందనేది లెక్క తేలదు.