'ధృవ' నుంచి రూటు మార్చిన మాస్ హీరో రామ్ చరణ్ తన తదుపరి చిత్రంలో వినికిడి లోపమున్న పల్లెటూరి యువకుడి పాత్ర చేస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్లో రూపొందే ఈ చిత్రం ఎనభైవ దశకం బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. ధృవ రొటీన్‌కి భిన్నమైనప్పటికీ యాక్షన్ హీరోగానే కనిపించాడు కనుక అది పూర్తిస్థాయి ఎక్స్పెరిమెంట్ అనలేం.
సుకుమార్ చిత్రంతో కంప్లీట్ మేకోవర్కి వెళుతోన్న చరణ్ వెంటనే మణిరత్నం చిత్రం చేయడానికి అంగీకరించాడు. ఇది ఫాన్స్‌ని కాస్త ఇబ్బంది పెడుతోంది. కమర్షియల్ పంథా నుంచి పూర్తిగా ఆఫ్ ట్రాక్ వెళ్లిపోతే తర్వాత మళ్లీ టాప్‌కి చేరుకోవడం కష్టమవుతుంది. మణిరత్నంతో చేయడం తప్పు కాదు కానీ, సుకుమార్ చిత్రం తర్వాత మణిరత్నంది చేయకూడదని అభిప్రాయపడుతున్నారు.
ఒక రెండు కమర్షియల్ చిత్రాలు చేసి, మధ్యలో ఒక ప్రయోగం చేస్తూ వుంటే బ్యాలెన్స్ అవుతుందనేది ఫాన్స్ ఉద్దేశం. అసలే ప్రస్తుతం ప్రతి శుక్రవారానికీ హీరోల ఫేటు మారిపోతున్న టైమ్‌లో చరణ్ టూమచ్ రిస్క్ తీసుకుంటున్నాడని, రొటీన్ సినిమాలు చేస్తున్నాడనే విమర్శలని సీరియస్‌గా తీసుకుని తన బలాన్ని వదిలేస్తున్నాడని ఫాన్స్ కలవరం.