Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దేవదాస్ కు నోటా షాక్?

దేవదాస్ కు నోటా షాక్?

నాని-నాగ్ ల మల్టీస్టారర్ దేవదాస్ సినిమా విడుదల ఇంకో పదిరోజుల్లో వుంది. ట్విట్టర్ హడావుడి తప్ప, మరే విధమైన బజ్ వస్తున్నట్లు కనిపించడంలేదు. ప్రేక్షకుల్లో ఈ సినిమా వస్తోందన్న ఆసక్తి అంతలా కనిపిస్తోందా? అన్నది అనుమానంగానే వుంది. ఇప్పటి వరకు సింగిల్స్ వదులుతున్నారు, స్టిల్స్ వదులుతున్నారు. అదంతా ట్విట్టర్ లో కనిపిస్తోంది, మీడియా గ్రూపుల్లో కనిపిస్తోంది. కానీ కింద లెవెల్ కు ఈ ఫబ్లిసిటీ వెళ్తున్నట్లు మాత్రం కనిపించడంలేదు.

నిజంగా అలా  వెళ్లి  వుంటే దేవదాస్ సినిమా హాట్ కేక్ లా అమ్ముడుపోయి వుండాలి. కానీ దాదాపు చాలా ఏరియాలు వైజయంతీ మూవీస్ ఓన్ గానే విడుదల చేసుకుంటున్నట్లు బోగట్టా. హీరో నాగ్ కు మరీ సూపర్ మార్కెట్ ఏమీలేదు. అందులోనూ ఆఫీసర్ సినిమా తరువాత అది ఢమాల్ మంది. ఇక నాని మీదనే భరోసా అంతా.

కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, డైరక్టర్ కూడా బ్లాక్ బస్టర్ లు కాకపోయినా, సూపర్ హిట్ లు ఇవ్వలేదు. భలే మంచిరోజు, శమంతకమణి లాంటి యావరేజ్ సినిమాలే అందించారు. ఇక మరో సమస్య బిగ్ బాస్. బిగ్ బాస్ పుణ్యమా అని నాని క్రేజ్ చాలావరకు డౌన్ అయిందని టాక్. వారానికి రెండురోజులు నానినే టీవీల్లో చూడడం, నాని వ్యవహారాలే డిస్కషన్లలో నానడం వంటి వాటి కారణంగా కూడా సినిమా వస్తోంది అంటే కొత్తగా అనిపించడం లేదు.

పైగా ఈ సినిమా వస్తున్న వారానికే విజయ్ దేవరకొండ 'నోటా' వస్తోంది. ఆ సినిమా ఎలా వుంటుందన్నది పక్కనపెడితే ఓపెనింగ్స్ మాత్రం వుంటాయి. సినిమా బాగుంటే ఇక ఆగమన్నా ఆగవు. ఆపై వారానికే అరవింద సమేత సినిమా వస్తోంది.

అంటే దేవదాస్ సినిమా వన్ వీక్ లోనే మాగ్జిమమ్ తెచ్చుకోవాలి. పైగా చిన్న మొత్తం కూడా కాదు. నాని, నాగ్, ఇద్దరు హీరోయిన్లు, కాస్త ఖర్చు వ్యవహారమే. మొత్తానికి దేవదాస్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోకుంటే కాస్త కష్టమే అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?