Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హలో గురూ.. హాట్ హాట్ గా

హలో గురూ.. హాట్ హాట్ గా

హలో గురూ ప్రేమకోసమే అంటూ వస్తున్నాడు హీరో రామ్. ఈ సినిమా టీజర్ బయటకు వదిలారు. సినిమా టీజర్ చూస్తుంటే గీత గోవిందం ఎఫెక్ట్ సినిమా మీద లేకున్నా, టీజర్ మీద వుందేమో అనిపిస్తుంది ఇన్ స్టాంట్ గా. అమ్మాయి అటు తిరిగి తల ఆరబెట్టుకుంటుంటే, అబ్బాయి లుక్స్ తేడాగా అనిపిస్తుండడం, పైగా 'నీకోసమే'..'కాఫీ'..'హాట్ హాట్..' అంటూ కాస్త రొమాంటిక్ టచ్ డైలాగులు పడడం చూస్తుంటే, రామ్ ట్రాక్ మెల్లగా మారే దిశగా వెళ్తున్నట్లు వుంది. 

అనుపమ పరమేశ్వరన్ ఈ టీజర్ లో మాత్రం కచ్చితంగా కాస్త హాట్ గానే వుంది. రామ్ మీసకట్టుతో కాస్త డిఫరెంట్ గా వున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ లు కొట్టిన నక్కిన త్రినాధరావు దర్శకుడు. ఫన్ అండ్ లవ్ నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. దసరా సీజన్ లో అక్టోబర్ 18న ఈ సినిమా విడుదలవుతోంది. 

దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాల తరువాత దేవీ ఆల్బమ్ ఇదే. మరి పాటలు ఎలా వుంటాయో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?