Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫస్ట్ వీకెండ్ పాసైన అల్లుడు

ఫస్ట్ వీకెండ్ పాసైన అల్లుడు

అనుకున్నట్లే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ టెస్ట్ పాసైపోయాడు శైలజారెడ్డి అల్లుడు. క్రిటిక్స్ నుంచి సరైన ప్రశంస రాకున్నా, వినాయకచవితి పండగ రోజులు కలిసివచ్చాయి. మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. తొలి నాలుగు రోజులకు డొమస్టిక్ మార్కెట్ లో 12 కోట్ల వరకు కలెక్షన్లు రావడం విశేషం. పది కోట్లు దాటతాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. కానీ మెల్లగా 11కోట్లు దాటి మరో 65 లక్షలు ప్లస్ అయ్యాయి.

డొమస్టిక్ మార్కెట్ ప్రీరిలీజ్ బిజినెస్ 18 కోట్లకు కాస్త ఎక్కువగా చేసారు. అయితే డబ్బులు కట్టినపుడు ఈ ఫిగర్ గాస్త తగ్గి, 17 కోట్లకు కాస్త అటుగా మిగిలింది. ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్ లో 12కోట్ల వరకు వచ్చింది అంటే కనీసం మరో అయిదు కోట్లు వసూలు చేయాలి. 

నైజాంలో నిన్న సండే 71లక్షల వరకు వుంది. ఈ లెక్కన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన వీక్ డేస్ అయిన సోమ, మంగళ, బుధ, గురు కలిపి మరో రెండు కోట్లకు పైగా నమోదు అయ్యే అవకాశం వుంది. వచ్చేవారం సరైన సినిమా పడకపోతే అల్లుడు బయ్యర్లు గట్టెక్కిపోతారు. లేదూ అంటే టెన్ పర్సంట్ అటు ఇటుగా వుంటుంది వ్యవహారం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?