ధనుష్ సినిమా విఐపి 2 తెలుగు వెర్షన్ కు ఎవరూ అంతగా ఆసక్తి కనబర్చకపోవడం వెనుక అసలు వైనం తెలిసింది. తెలుగు వెర్షన్ ఫస్ట్ కాపీకి తమిళ నిర్మాతలు 12కోట్లు కావాలంటున్నారట. ఒక్క పైసా కూడా తక్కువకు కుదరదని అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో కాస్త ఆసక్తి కనబర్చిన ఒకరిద్దరు కూడా వెనకడుగు వేసారని తెలుస్తోంది.
12కోట్లు అంటే ఖర్చులు, పబ్లిసిటీ అన్నీ కలిపి మరో కోటి. అంటే 13కోట్లు. మరి ఆ రేంజ్ అమ్మకాలు వుంటాయా అన్నది అనుమానం. ఇదిలా వుంటే దాదాపు ప్రతి తమిళ సినిమాకు ఇప్పుడు రేట్లు అలాగే చెబుతున్నారట.
తెలుగు వాళ్లు అడగడం భయం భారీ రేట్లు చెబుతున్నారట. దాంతో డబ్బింగ్ సినిమాలంటేనే రెగ్యులర్ ప్రొడ్యూసర్లు ఆసక్తి కనబర్చడం మానేసారు. రజనీ, అజిత్ లాంటి వాళ్ల సినిమాలు తప్పవు. సూర్య, కార్తీకి కూడా ఇప్పుడు తెలుగు నాట డిమాండ్ తగ్గింది.
అందుకే ఇప్పుడు డబ్బింగ్ అంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న వారు ఆసక్తి కనబరుస్తున్నారు కానీ, పాత వాళ్లు మాత్రం దూరంగానే వుంటున్నారు.