నక్షత్రం వెనక్కు వెళ్తుందా?

కృష్ణ వంశీ-సాయిధరమ్-సందీప్ కిషన్ కాంబినేషన్ లో ముస్తాబయిన సినిమా నక్షత్రం. సినిమా అంతా దాదాపు రెడీ అయిపోయింది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు వుంటే ఇటీవలే ఫినిష్ చేసేసారు. దాదాపు ఫస్ట్ కాపీ…

కృష్ణ వంశీ-సాయిధరమ్-సందీప్ కిషన్ కాంబినేషన్ లో ముస్తాబయిన సినిమా నక్షత్రం. సినిమా అంతా దాదాపు రెడీ అయిపోయింది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు వుంటే ఇటీవలే ఫినిష్ చేసేసారు. దాదాపు ఫస్ట్ కాపీ రెడీ అయిపోయినట్లే. 21న వద్దాం అనుకుంటే వరుణ్ తేజ ఫిదా అడ్డం పడింది. 28న ఫిక్సయిపోయారు. ఆ మేరకు మీడియాకు సమాచారం కూడా అందింది.

కానీ ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే, వన్ వీక్ వెనగ్గా రావాలని అనుకుంటున్నారు అన్నది. మరి ఎందుకు అలా అన్నది తెలియదు. 28తో పోల్చుకుంటే 4న కాంపిటీషన్ తక్కువే అని చెప్పాలి. బహుశా ఆ ఉద్దేశంతో అలా ఆలోచిస్తున్నారేమో? కానీ అంతకన్నా వెనక్కు వెళ్లడానికి ఇక అవకాశం లేదు. 

11న మూడు పెద్ద సినిమాలు వున్నాయి. అదే 25న నాగ్ చైతన్య యుద్ధం శరణం వుంది. 11కు 25కు మధ్యలో కూడా సినిమాలు వున్నాయి. మరి 28కి వస్తారో? వెనక్కు వెళ్తారో? నక్షత్రం యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి వుంది.