రామ్ చరణ్ కొత్త సినిమా 'ధృవ' పాటలొచ్చాయ్. తమిళంలో తని ఒరువన్ చిత్రానికి మ్యూజిక్ చేసిన హిప్‌హాప్ తమిళ ఈ చిత్రానికీ మ్యూజిక్ అందించాడు. తెలుగు మాస్ హీరోకి తగ్గ పాటలు చేయడంలో ఇతను విఫలమయ్యాడు. పాటలు వినడానికి వెరైటీగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ సినిమా నుంచి మాస్ ఆశించే పాటలేం లేవు.
ఈ పాటలు వింటుంటే కొందరికి 'తుఫాన్' పాటలు గుర్తుకొస్తున్నాయి. తమిళంలో మ్యూజిక్ బాగా చేసాడని తమిళకి అవకాశం ఇచ్చినట్టున్నారు కానీ మన హీరోల ఇమేజ్‌కి తగ్గట్టు పాటలు చేసే తమన్ లేదా దేవిశ్రీప్రసాద్‌ని సంగీత దర్శకుడిగా పెట్టుకుని ఉంటే నేటివిటీకి మ్యాచ్ అయ్యే పాటలుండేవి.
ఈ పాటలు బాగున్నాయంటూ ట్రెండ్ చేయడానికి రామ్ చరణ్ అభిమానులు ఎంత ప్రయాసపడుతున్నా కానీ పాటలు ఆకట్టుకోలేదన్న నిజాన్ని మాత్రం ఒప్పుకుని తీరాలి. ఆడియో పరంగా వీక్ అయిపోయిన ధృవపై ఇప్పుడు బజ్ పెరగాలంటే పబ్లిసిటీ పరంగా చాలా కేర్ తీసుకోవాలి. గీతా ఆర్ట్స్ కనుక ఆ డిపార్ట్‌మెంట్‌లో అన్నీ జాగ్రత్తగానే జరుగుతాయని అభిమానులు ఆశిస్తున్నారు.