రైటర్ కు కథ చెప్పనన్న రైటర్

ఆయన ఓ సీనియర్ రైటర్. మీరు డబ్బులు పట్రండి.. నేను ప్రాజెక్టులు సెట్ చేస్తాను.. కలిసి లాభాలు పంచుకుందాం అనే స్కీములు ఆయన స్వంతం. అయితే ఆయనతో కలిసి సినిమాలు తీసిన నిర్మాత, ఆయనకు…

ఆయన ఓ సీనియర్ రైటర్. మీరు డబ్బులు పట్రండి.. నేను ప్రాజెక్టులు సెట్ చేస్తాను.. కలిసి లాభాలు పంచుకుందాం అనే స్కీములు ఆయన స్వంతం. అయితే ఆయనతో కలిసి సినిమాలు తీసిన నిర్మాత, ఆయనకు తెలియకుండా ఓ ప్రాజెక్టు సెట్ చేసుకున్నాడట. దీంతో ఖంగు తిన్న ఆ సీనియర్ రైటర్,  ఏమిటా ప్రాజెక్టు, కథ ఎవరు ఇచ్చారు? హీరో ఎవరు? అని ఆ నిర్మాతను ప్రశ్నలు వేసి, ప్రాజెక్ట్ వేయబుల్ కాదని తేల్చేసారట. 

కానీ ఆ నిర్మాత వినలేదు. పోనీ ఓసారి ఆ సినిమాకు కథ అందిస్తున్న రైటర్ ను వచ్చి తనకు కథ చెప్పమని ఈ సీనియర్ రైటర్ అడిగారట. ఆ కథ మాటలు ఎవరివి ?  ఇటీవల కాస్త ఎక్కవగా ఫన్ సినిమాలకు 'వజ్రాల్లాంటి' మాటలు అందిస్తున్న ఆ కథారచయిత వి. సరే, ఓసారి కథ చెప్పమని నిర్మాత అడిగితే, సినిమా అన్నా వదులుకుంటా కానీ, ఆ సీనియర్ రైటర్ కు తన కథ చెప్పను కాక చెప్పను అని కుండ బద్దలు కొట్టేసాడట ఈ రచయిత. 

తన కథ, మాటలు తనవని, తను వెళ్లి, మరో రైటర్ కు వినిపించడం ఏమిటని అన్నాడట. పైగా ఆ సీనియర్ రైటర్ కు అయితే అసలు వినిపించనని క్లియర్ గా చెప్పేసాడట. దాంతో ఆ సీనియర్ రైటర్ కు గట్టి ఝలక్ తగిలిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.