Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్‌కి బాలయ్య 'పవర్‌' పంచ్‌.?

పవన్‌కి బాలయ్య 'పవర్‌' పంచ్‌.?

ఇద్దరు ప్రముఖ సినీ నటుల మధ్య మాటల యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. అనంతపురం వేదికగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, అధికార తెలుగుదేశం పార్టీని ప్రశ్నించడంతో, ఆ ప్రశ్నలకు కౌంటర్‌ ఇవ్వాల్సిన బాధ్యత మరో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీద పడిందిప్పుడు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం విదితమే. 

ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు, పవన్‌కళ్యాణ్‌ మీద లైటర్‌ వీన్‌లో విమర్శల దాడి షురూ చేశారు. రేప్పొద్దున్న బాలయ్య ఎంట్రీ వుండబోతోందట. అది కూడా, హిందూపురంలోనే ప్రెస్‌మీట్‌ పెట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క, ఈ వారాంతంలో బాలకృష్ణతో హిందూపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, బలప్రదర్శన చేయాలనే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారనే ప్రచారమూ తెరపైకొచ్చింది. 

అనంతపురం జిల్లాలోనే తొలి కార్యాలయం.. అని పవన్‌కళ్యాణ్‌ ప్రకటించడమే కాదు, ఈ జిల్లా నుంచే పోటీ చేస్తాననే సంకేతాలు పంపిన దరిమిలా, టీడీపీ నేతలకన్నా ఎక్కువగా బాలయ్య మీదే పొలిటికల్‌ ప్రెజర్‌ పెరిగినట్లయ్యింది. అనంతపురం - కరువు జిల్లా.. అందునా రాయలసీమ జిల్లా.. అనే కాన్సెప్ట్‌తోనే పవన్‌, ఈ జిల్లాని ఎంచుకున్నాడు జనసేన బహిరంగ సభ కోసం. అయితే, అది కాస్తా ఇప్పుడు పవన్‌ వర్సెస్‌ బాలయ్య.. అనే స్థాయికి వెళ్ళినట్లే కన్పిస్తోంది. చూద్దాం.. ఏం జరుగుతుందో.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?