దిక్కులు చూస్తున్న చైతన్య

‘ఒక లైలా కోసం’ తొలి రోజు సాధారణ వసూళ్లతో ప్రయాణం స్టార్ట్‌ చేసినా కానీ రెండో రోజు బాగా పుంజుకుంది. సినిమా డీసెంట్‌గా ఉందనే టాక్‌ స్ప్రెడ్‌ అవడంతో దీనికి అంతటా మంచి షేర్లు…

‘ఒక లైలా కోసం’ తొలి రోజు సాధారణ వసూళ్లతో ప్రయాణం స్టార్ట్‌ చేసినా కానీ రెండో రోజు బాగా పుంజుకుంది. సినిమా డీసెంట్‌గా ఉందనే టాక్‌ స్ప్రెడ్‌ అవడంతో దీనికి అంతటా మంచి షేర్లు వస్తున్నాయి. లవర్‌బాయ్‌గా చైతన్య మరోసారి తన సత్తా చాటుకుంటున్నట్టే కనిపిస్తోంది. 

ఇదిలావుంటే చైతన్య త్వరలో త్రికోటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని టాక్‌ వినిపిస్తోంది. ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన త్రికోటి ఎప్పుడో నాగచైతన్య కోసం ఒక కథ రాసాడు. అప్పట్లో స్టోరీ సిట్టింగ్స్‌ కూడా జరిగిన తర్వాత ప్రాజెక్ట్‌ కాన్సిల్‌ అయింది. ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాన్ని అతను హ్యాండిల్‌ చేసిన తీరు నచ్చడంతో మళ్లీ నాగార్జున నుంచి కబురు వచ్చిందట. 

నాగచైతన్య తన తదుపరి చిత్రంతో కొత్త జోనర్‌ని ట్రై చేస్తున్నాడు. రొమాంటిక్‌ కథలకి బ్రేక్‌ ఇస్తూ థ్రిల్లర్‌ ఎటెంప్ట్‌ చేస్తున్నాడు. స్వామిరారా దర్శకుడు సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి మంచి బజ్‌ ఉంది. దీనిని వచ్చే ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.