దిల్ రాజు కేరింతలు

సంతోషం ఎక్కువైతే కేరింతలు వస్తాయి.  ఇప్పుడ దిల్ రాజు పరిస్థితి ఇదే. చాన్నాళ్లుగా ఏక్టర్లను మార్చి, స్క్రిప్ట్ ను అటు ఇటు చేసి, మొత్తానికి కేరింత సినిమాను థియేటర్లలో పడేసాడు. దీనికోసం విపరీతంగా, వైవిధ్యమైన…

సంతోషం ఎక్కువైతే కేరింతలు వస్తాయి.  ఇప్పుడ దిల్ రాజు పరిస్థితి ఇదే. చాన్నాళ్లుగా ఏక్టర్లను మార్చి, స్క్రిప్ట్ ను అటు ఇటు చేసి, మొత్తానికి కేరింత సినిమాను థియేటర్లలో పడేసాడు. దీనికోసం విపరీతంగా, వైవిధ్యమైన పబ్లిసిటీ చేసాడు. తొలివారం సో సో అనుకన్నారు. మలివారం సరైన సినిమా పడలేదు. జనం కేరింతనే నెత్తన పెట్టుకున్నారు. 

ఇప్పుడు ఈ చిన్న బడ్జెట్ సినిమా పెద్ద హిట్ అయిపోతోంది. మలివారం సాలిడ్ గా నిలబడిపోయింది. దీనికి కారణం ఇప్పుడు కూడా సరైన సినిమా పడకపోవడమే. ఒక్క వైజాగ్ ఏరియాకే కేరింత కోటిన్నర షేర్ సాధించేసింది.  రెండు రాష్ట్రాల్లో దిల్ రాజు స్వంతంగా రిలీజ్ చేసుకున్నారు. అంటే కనీసం నాలుగు నుంచి అయిందు కోట్ల షేర్ వచ్చే అవకాశం కనిపిస్తోందిశాటిలైట్ ఇంకా కాలేదు కాబట్టి కనీసం మూడు కోట్లకు లాగేసే అవకాశం వుంది.  

సినిమాకు కొత్త స్టార్ కాస్టింగ్, పెద్దగా ప్రొడక్షన్ ఖర్చు కూడా లేదు. అంటే కేరింతలో మంచి లాభాలు చూసే అవకాశం వుంది. ఇటీవలే గంగ సినిమాలో కూడా మంచి లాభాలు చవిచూసాడు. అందుకే దిల్ రాజు కేరింతలే కేరింతలు.