ప్రతి ఏక్టర్ కు హీరో కావాలని వున్నట్లే, కొంత మంది నిర్మాతలకు డైరక్టర్ కావాలని వుంటుంది. మంచి అభిరుచి, అనుభవం వున్న దిల్ రాజుకు ఈ కోరిక ఎప్పటి నుంచో వుంది. కానీ టైమ్ రావడం లేదు. అయితే ఇప్పటికీ కథలకు ట్రీట్ మెంట్, సినిమాల నిర్మాణంలో ఆయన తన టాలెంట్ ను పరోక్షంగా వాడుతూనే వుంటారు.
రీసంట్ గా ఆయన నిర్మిస్తున్నశతమానం భవతి సినిమా విషయంలో దిల్ రాజు తన అనుభవాన్ని కాస్త ఎక్కువగానే ఉపయోగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు దర్శకుడు రచయిత సతీష్ వేగ్నిశ. ఈ సినిమా సబ్జెక్ట్ విపరీతంగా నచ్చేసిన దిల్ రాజు, షూటింగ్ ఆద్యంతం వుండడమే కాకుండా, అప్పుడప్పుడు సీన్లు కూడా డైరక్ట్ చేసినట్లు, ముఖ్యంగా క్లయిమాక్స్ విషయంలో చేయి చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా బాగా వచ్చిందని టాక్ వినిపిస్తోంది కాబట్టి, భరోసా తో పాటు దిల్ రాజు డైరక్షన్ కోరిక కూడా మరింత పెరుగుతుందేమో?