దిల్ రాజు కు మరో ‘మజిలీ’

ఈ ఏడాది నిర్మాతగానే కాదు, డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు లక్ బాగున్నట్లుంది. నిర్మాతగా ఎఫ్ 2 జాక్ పాట్ ఇచ్చింది. మిస్టర్ మజ్ఞు ఫరవాలేదు. 118 కమిషన్ కిట్టింది. ఇప్పుడు లేటెస్ట్…

ఈ ఏడాది నిర్మాతగానే కాదు, డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు లక్ బాగున్నట్లుంది. నిర్మాతగా ఎఫ్ 2 జాక్ పాట్ ఇచ్చింది. మిస్టర్ మజ్ఞు ఫరవాలేదు. 118 కమిషన్ కిట్టింది. ఇప్పుడు లేటెస్ట్ గా మజిలీ వచ్చింది. ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసారు. ఫస్ట్ వీకెండ్ లో అయిదు కోట్లకు పైగా వచ్చింది. అయిదు కోట్ల రిటర్న్ బుల్ అడ్వాన్స్ మీద డిస్ట్రిబ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. పస్ట్ వీకెండ్ లోనే ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కు వచ్చేసింది. కచ్చితంగా ఇక్కడ ఎనిమిది కోట్ల వరకు చేస్తుందని అంచనా వేస్తున్నారు అంటే మంచి కమిషన్ వస్తుంది.

ఇదిలావుంటే మజిలీ సినిమా టోటల్ ఫస్ట్ వీకెండ్ లో మంచి ఫలితాలు నమోదు చేసింది. ఒక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే 13 కోట్లకు పైగా వసూలు చేసింది. టోటల్ గా వరల్డ్ వైడ్ గా రెండు కోట్లకు కాస్త అటుగా వచ్చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే. కొన్ని ప్రాంతాల్లో మూడువంతులు, కొన్ని ప్రాంతాల్లో సగానికి పైగా వచ్చింది వీకెండ్ లో.

మూడోరోజు కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి
నైజాం…….1.59 కోట్లు
సీడెడ్…….46.14 లక్షలు
వైజాగ్…….54.10
ఈస్ట్………25.10
వెస్ట్……….16.10
కృష్ణ………28.10
గుంటూరు… 25,87
నెల్లూరు….9.53

సునాయాసంగా అధికారాన్ని సొంతం చేసుకోనున్న వైఎస్సార్సీపీ