సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ లు జాస్తి. డైరక్టర్లు, హీరోలకు బోలెడు. ఒక్కోసారి ఈ సెంటిమెంట్ల పుణ్యమా అని లక్షలు ఖర్చయిపోతుంటాయి. లేటెస్ట్ గా ఇలాంటి ఇన్సిడెంట్ నే ఒకటి జరిగింది. చిత్రలహరి అడియో ఫంక్షన్ శిల్పకళావేదికలో జరిగింది. సాధారణంగా భారీ, పెద్ద హీరోల సినిమాలు తప్ప మిగిలిన వాటికి శిల్పకళావేదికను ఎంచుకోరు. జనాలు ఆ రేంజ్ లో రావాలి. దాదాపు 15లక్షలు కేవలం ఆడిటోరియంకే చెల్లించాలి.
మీడియం, అబౌవ్ మీడియం సినిమా లు అన్నీ ఎక్కువగా జేఆర్సీ ఫంక్షన్ హాల్ లో జరుగుతుంటాయి. అక్కడ అయితే అయిదారులక్షలతో ఆడిటోరియం దొరుకుతుంది. కానీ చిత్రలహరి హీరో సాయిధరమ్ తేజ్ మాత్రం ఫంక్షన్ ను శిల్పకళావేదికలో చేయమని పట్టుపట్టినట్లు ఫోగట్టా. తనకు అది సెంటిమెంట్ అని చెప్పినట్లు తెలుస్తోంది.
దాంతో నిర్మాతలు మైత్రీమూవీస్ కాదనలేక, అక్కడే ఫంక్షన్ చేసారు. దాంతో దాదాపు తొమ్మది లక్షలు అదనపు ఖర్చు తప్పలేదని తెలుస్తోంది. చిత్రలహరి సినిమా ఈనెల 12న విడుదలవుతుంది. ఈసినిమా హీరో సాయిధరమ్ కు లైఫ్ అండ్ డెత్ లాంటిది. ఆరు సినిమాల ప్లాపుల తరువాత చేస్తున్న సినిమా ఇది అని ఆయనే పదే పదే ప్రీరిలీజ్ ఫంక్షన్ లో చెప్పడం విశేషం.