Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్ రాజుకు రవిబాబు 'ఆవిరి'

దిల్ రాజుకు రవిబాబు 'ఆవిరి'

నచ్చావులే అంటూ రామోజీ క్యాంప్ నుంచి చిన్న సినిమాలకు శ్రీకారం చుట్టి, సురేష్ బాబు క్యాంప్ లోకి వచ్చారు డైరక్టర్ కమ్ నటుడు రవిబాబు.అయితే అవును 2, అదిగో లాంటి ఫ్లాపులు వచ్చిన తరువాత రవిబాబు డైరక్షన్ కెరీర్ వెనుక బడింది. ఇప్పుడు మరో చిన్న సినిమా చేసారు. కొత్తవాళ్లతో చేసిన ఆ సినిమా టైటిల్ ఆవిరి. ఈ విషయం ఇప్పటికే బయటకు వచ్చింది.

లేటెస్ట్ సంగతి ఏమిటంటే, ఈ సినిమా విడుదల బాధ్యతలు ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తీసుకున్నారు. ఈ సినిమాను ఆయన విడుదల చేసి పెడుతున్నారు. ఇప్పటి వరకు సురేష్ బాబుతో ప్రయాణించిన రవిబాబు ఒక్కసారిగా దిల్ రాజు వైపు రావడం కాస్త ఆశ్చర్యమే. వాస్తవానికి సురేష్ బాబు కూడా చిన్నసినిమాలు ఏవి వచ్చినా, బ్యానర్ యాడ్ చేసి, విడుదల చేయించి, అడ్వాన్స్ లు ఇచ్చి సహకరిస్తున్నారు.

కానీ మరి రవిబాబు ఆ క్యాంపస్ వదిలి దిల్ రాజు క్యాంపస్ లోకి రావడం వెనుక ఏమై వుంటుందో? ఒకటి రెండు రోజుల్లో రవిబాబు సినిమా దిల్ రాజు విడుదల చేయబోతున్నారనే అధికారిక ప్రకటన రాబోతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?