నిర్మాత దిల్ రాజుకు టీటీడీ బోర్డులో సభ్యత్వం వచ్చే అవకాశం వుంది అన్నది పొలిటికల్ గ్యాసిప్. ఇది చాలావరకు నిజమయ్యే అవకాశం కూడా వుంది. దిల్ రాజు లాంటి వెంకన్న భక్తుడికి ఇవ్వడం మంచిదే కూడా. సభ్యత్వాన్ని, పరిచయాలను అడ్డం పెట్టుకుని, ఏదో విధంగా వెంకన్న డబ్బులు తినేసేరకం అయితే దిల్ రాజు కాదు. అది వాస్తవం.
అయితే ఈ సభ్యత్వం విషయంలో దిల్ రాజు రెండు రకాల స్ట్రాటజీలతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఒకటి. ఆయన చాలా సిన్సియర్ గా తనకున్న సంబంధాలు వాడుకుంటూ సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. వైకాపా కీలకనేత విజయసాయిరెడ్డిని కూడా ఆయన సంప్రదించినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.
రెండో విషయం ఏమిటంటే, టీటీడీ సభ్యత్వం విషయంలో ఆయనకు వైకాపా నాయకత్వం నుంచి ఆఫర్ వచ్చిందని, కానీ తీసుకోవాలా? వద్దా? అనే మీమాంసలో వున్నారంటూ ఫీలర్లు బయటకు వదులుతున్నారు. అంటే బై మిస్టేక్, సభ్యత్వం రాకపోతే, దిల్ రాజుకు రాలేదు అని మీడియా ఎక్కడ రాస్తుందో? అనే ఆలోచనలతో, ఆయనే వద్దనుకున్నారు అని ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేయడం అన్నమాట.
దీన్నే రివర్స్ స్ట్రాటజీ అంటారేమో? వస్తే ఒకలా? రాకుంటే మరోలా.. ముందు జాగ్రత్త.