cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

సరిలేరు.. శాటిలైట్ @ 16.5 కోట్లు

సరిలేరు.. శాటిలైట్ @ 16.5 కోట్లు

అనిల్ రావిపూడి క్రేజ్, మహర్షి హిట్ తోడయ్యాయి సూపర్ స్టార్ మహేష్ బాబుకు. సరిలేరు నీకెవ్వరు సినిమా శాటిలైట్ రేట్ బాంబ్ లా పేలింది. 16.5 కోట్ల రేంజ్ లో ఆ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని టీవీ తీసుకుంది. ఇది హయ్యస్ట్ ఫ్రయిస్. మహర్షి సినిమాకు వచ్చింది 12 కోట్లే.

కేవలం శాటిలైన్ ను మాత్రమే జెమిని తీసుకుంది. ఇంకా డిజిటల్, అడియో, హిందీ డబ్బింగ్ ఇవన్నీ వున్నాయి. అన్నీకలిసి యాభై కోట్లకు పైగా అంచనా వేస్తున్నారు. ఇవన్నీ కలిపి మహర్షికి 45 కోట్లకు కాస్త అటుగా వచ్చాయి.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, నాన్ థియేటర్ రైట్స్ అన్నీ మహేష్ వే. సినిమా నిర్మాణ భాగస్వామ్య ఒప్పందమే అది. అనిల్ సుంకర, దిల్ రాజులకు థియేటర్ రైట్స్, మహేష్ బాబుకు నాన్ థియేటర్ రైట్స్. ఇక నో రెమ్యూనిరేషన్. అంటే మహేష్ బాబుకు రెమ్యూనిరేషన్ కింద 50 కోట్లకు పైగానే వస్తుందన్నమాట.

మహర్షి సినిమా శాటిలైట్ విషయంలో కాస్త అటు ఇటు అయింది. ఓ ఛానెల్ లో సినిమాను వుంచడం, కానీ లాస్ట్ మినిట్ లో రేటు కిట్టదని వెనక్కు తీసుకుని మరో ఛానెల్ కు ఇవ్వడం లాంటివి జరిగాయి. ఈసారి అలాంటివి ఏవీ లేకుండా స్మూత్ గా డీల్ సెటిల్ చేసుకున్నారు.

బాబుపై కేసుల విచారణకు ఇక అవరోధాలు లేవు