Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా?

దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా?

శతమానం భవతి పై చాలా ఆశలు పెట్టుకున్నాడు నిర్మాత దిల్ రాజు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా విజయవంతం అయితే దిల్ రాజు కు ఒక కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మేకింగ్ లో నిర్మాతగా మాత్రమే కాకుండా డైరక్టర్ పాత్రను కూడా దిల్ రాజు చాలా వరకు పోషించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

తన అభిరుచికి అనుగుణంగా దగ్గర వుండి సీన్లు చేయించుకున్నారు. ప్రతి సీన్ లోనూ ఆయన ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది.

పల్లెటూళ్లు, ఆప్యాయతలు, అనుబంధాలు వగైరా వ్యవహారాలపై తీసిన ఈ సినిమా గోవిందుడు అందరి వాడేలే, సీతారామయ్య గారి మనవరాలు స్టయిల్ లో వుంటుదని వినికిడి.

ఇలాంటి సినిమాను దిల్ రాజు ఖైదీ నెంబర్ 150, గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి భారీ సినిమాల మీద వదుల్తున్నారు. సంక్రాంతి కి జనాలు ఇప్పటికే ఖైదీనా, శాతకర్ణినా అన్నట్లున్నారు. ఆ సినిమాలు వచ్చిన మూడు రోజులకు వస్తున్నా కూడా, ఫస్ట్ వీక్ అంతా మాత్రం రిటర్న్ ట్రాఫిక్ మీదే ఆధారపడాలి. ఆ తరువాతే అసలు ఫైట్ వుంటుంది.

శాతకర్ణి, ఖైదీల్లో ఒకటి హిట్ అంటే ఓకె. రెండూ హిట్ అంటే మాత్రం శతమానం సంగతి అనుమానం అన్న పరిస్థితి వుంటుంది. మరి ఇంత రిస్క్ దిల్ రాజు ఎందుకు చేస్తున్నట్లో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?