ఉన్నట్లుంటి థర్టీ ఇయర్స్ పృధ్వీ హాట్ టాపిక్ అయ్యారు. కాస్త ఓవర్ ఎమోషనల్ అయి సోషల్ నెట్ వర్క్ లో చేసిన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఖైదీ నెంబర్ 150లో తన పోర్షన్ మొత్తం తీసేసారని, అది తనను తల్లి మరణంతో సమానమైన బాధను కలిగించిందని పృధ్వీ పేర్కొన్నారు. ఏమిటిదంతా అని ఓ సారి పృధ్వీని పలకరించాం.
ఏమిటి? ఇంత ఎమోషనల్ అయ్యారు?
అవునండీ..చాలా షాక్. ఎవరి ఇన్సిఫిరేషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చానో? ఎవరి సినిమాలంటే పిచ్చి పడతానో, అలాంటి మెగాస్టార్ట్ ప్రతిష్టాత్మక సినిమాలో చిన్న పాత్రయినా పోషించాలనుకున్నాను. అలాంటిది మంచి పాత్ర దొరికింది. కానీ తీరా చివర్న అది కాస్తా తీసేసారని తెలిసేసరికి తట్టకోలేకపోయాను.
మీకు ఈ విషయం యూనిట్ ద్వారానే తెలిసిందా?
లేదు. ఎక్కడో వార్త వచ్చిందని తెలిసి, గోదావరి జిల్లాల నుంచి అభిమానులు ఎవరో ఫోన్ చేసి చెప్పారు. వెంటనే డైరక్షన్ డిపార్ట్ మెంట్ లోని పుల్లారావు గారికి ఫోన్ చేసి అడిగితే, అవును, లెంగ్త్ కోసం, అలాగే సరిగ్గా స్క్రిప్ట్ లో సెట్ కాలేదని తీసేసాం అన్నారు.
ఎన్ని రోజులు వర్క్ చేసారు?
మూడు రోజులు వర్క్ చేసాను.
ఎప్పటిలాగే స్పూఫ్ లేమన్నా చేసారా?
లేదు. ఇది మంచి క్యారెక్టర్. మంత్రి పాత్ర. నాకు అసిస్టెంట్ గా దువ్వాసి మోహన్ నటించారు.
మీ సీన్ లు అన్నీ తీసేయడం వల్ల సినిమాలో కాంబినేషన్ సీన్లు ఏమీ దెబ్బ తినవా?
అబ్బే అలాంటి అవకాశం లేదు.
బ్రహ్మానందంతొ మీకు కాంబినేషన్ సీన్లు ఏవీ లేవా?
లేవు. నా ట్రాక్ వేరు
ఓ సినిమాలో ఏదో సమస్య వల్ల క్యారెక్టర్ కట్ చేస్తే, అంత ఎమోషన్ కావడం అవసరమా?
నాకు చిరంజీవి గారితో వున్న అనుబంధం అలాంటిది. ఆయన ప్రజారాజ్యం పార్టీతో ఏడాదిన్నర అసోసియేషన్ వుంది నాకు. ఆయన ప్రెస్టీజియస్ సినిమాలో నేను వున్నాను అనుకుంటే ఆ ఫీలింగే వేరు. అందుకే కాస్త ఎమోషనల్ అయ్యాను.
ఈ విషయం పై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసారా?
లేదు. ఆయనకు తెలియకుండా జరగదు కదా?
డబ్బింగ్ చెప్పేటపుడు సినిమా చూసి వుంటారు కదా? ఎలా వుంది?
నా పాత్ర వరకు చూసాను. సినిమా బాగా వచ్చింది. టోటల్ గా సినిమా చాలా బాగా వచ్చిందని వింటున్నాను. చిరంజీవి అంటే అభిమానం వున్న వ్యక్తిగా నాకు చాలా ఆనందంగా వుంది ఆ విషయం.
కానీ ఇప్పుడు ఆ సినిమాలో పాత్రే లేదు. ఇంకేమిటి?
ఇంకేముంది..న్యూ ఇయర్ లో ఇది నాకో షాక్. అదే బాధగా వుంది. అంతే
రాబోయే సినిమాల సంగతులేమిటి?
మిస్టర్, విన్నర్ రెండుసినిమాల్లో మంచి రెండు క్యారెక్టర్లు చేస్తున్నాను.
వాటిల్లో కూడా స్పూఫ్ లు వున్నాయా?
లేదు. ఇకపై స్పూఫ్ లు చాలా రేర్ గా చేస్తాను. అసలు చేయకపోచ్చు కూడా.
విఎస్ఎన్ మూర్తి