ప్రముఖ నిర్మాత ..డిస్ట్రిబ్యూటర్.. టాలీవుడ్ లో సూపర్ సెలబ్రిటీ హోదా ఉన్న దిల్ రాజు త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా.. ఇదే ఇప్పుడు సెన్సేషన్ న్యూస్.
ఆయన తన భార్య మరణించిన తరువాత ఒంటరి తనంతో బాధ పడుతున్నారు. పైకి హుషారుగా సవాలుగా వ్యాపారాలు సాగిస్తున్నాయా ఒంటరితనం ఆయనను బాధ పెడుతోంది. పైగా ఇంతటి సామ్రాజ్యాన్ని దేనికి సాధిస్తున్నట్లు.
కుమార్తె. మనవడు..మనవరాలు ఉన్నారు కానీ తన కంటూ ఒకరు ఉండాలి గా. అందుకే ఈ వేసవి లో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
అమ్మాయి ఇండస్ట్రీ కి చెందిన వారు కాదు అని భోగట్టా. అలాగే ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళ అని వినిపిస్తోంది.
నిజానికి ఇదంతా దిల్ రాజు పెర్సొనల్ విషయం. కానీ ఆయన ఇవ్వాళ రెండు రాష్ట్రాల్లో..తెలుగు ప్రజలకు సంబంధించి పెద్ద సెలబ్రిటీ. అందువల్ల ఈ వార్త అందించాల్సి వస్తోంది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ వార్తని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసిన తర్వాతే ఇవ్వడం జరుగుతోంది. వినిపిస్తున్న వార్తలు నిజమే అయితే.. అందరికన్నా ముందుగా దిల్ రాజు కు అభినందలు అందిస్తున్నాం.