దిల్ రాజు వ్యూహానికి తలొగ్గిన మహేష్

సరైన సినిమాలు లేక థియేటర్లు విలవిల లాడుతున్నాయి. దాదాపు జనవరి నుంచి ఇప్పటివరకు థియేటర్లకు అద్దెలు కిట్టుబాటు కావచ్చు కానీ, అదనపు ఆదాయాలైన క్యాంటీన్, పార్కింగ్ లకు నష్టాలే వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో…

సరైన సినిమాలు లేక థియేటర్లు విలవిల లాడుతున్నాయి. దాదాపు జనవరి నుంచి ఇప్పటివరకు థియేటర్లకు అద్దెలు కిట్టుబాటు కావచ్చు కానీ, అదనపు ఆదాయాలైన క్యాంటీన్, పార్కింగ్ లకు నష్టాలే వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో సమ్మర్ సీజన్ వస్తోంది. దీన్ని పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోతే, అన్ని సినిమాలు ఒకేసారి పడి, ఆ తరువాత పరిస్థితి మళ్లీ మామూలైపోతుంది. 

పైగా చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ ఇటు నైజాంలో అటు వైజాగ్ లో దిల్ రాజే. అటు నాగచైతన్య మజిలీ, నాని జెర్సీ, సాయిధరమ్ చిత్రలహరి, మహేష్ మహర్షి. ఇంకా మధ్యలో వచ్చే అనేక చిన్న సినిమాలు దిల్ రాజు దగ్గరకే వచ్చాయి. వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో మహేష్ మహర్షి ఏప్రియల్ 25న రావడం అన్నది దిల్ రాజుకు అంత అనుకూలంగా లేదు అని వినికిడి.

ఈ ఒక్క సినిమాను కాస్త వెనక్కు జరిపితే మజిలీ, జెర్సీ, చిత్రలహరి సినిమాలకు లైన్ క్లియర్ అయిపోతుంది. వారం బదులు రెండేసి వారాలు గ్యాప్ వస్తుంది. లేదూ అంటే ఒకదాని మీద మరోటి వచ్చేస్తాయి. అందుకే కిందామీదా పడి, మహేష్ ను ఒప్పించి, ఆయనకు ఇష్టంలేని మే నెల విడుదలకు మహర్షి సినిమాను తీసుకెళ్లగలిగారు.

ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రియల్ 25కు మహర్షి రెడీ చేస్తున్నామని ఒక పక్క చెబుతూనే, మరోపక్క తన డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మాత్రం మే విడుదల అని దిల్ రాజు సమాచారం అందించారని తెలుస్తోంది.

డైరక్టర్ వంశీ పైడిపల్లి మీద, సినిమా క్వాలిటీ మీద నెపంతోసి, సినిమాను దిగ్విజయంగా మే నెలలోకి పంపడం అన్నది దిల్ రాజు థియేటర్ వ్యూహం తప్ప వేరుకాదని వినిపిస్తోంది. ఇలా జరగకపోయి వుంటే ఏప్రియల్ 5న మజిలీ, జెర్సీ పోటీ పడాల్సివుండేది.

వారం తిరగకుండా 12న చిత్రలహరి వచ్చి వుండేది. ఇప్పుడు 5న మజిలీ, 19న జెర్సీ వస్తున్నాయి. ఆపై వారం కానీ, మరి కాస్త గ్యాప్ ఇచ్చి కానీ చిత్రలహరి విడుదల చేస్తారు. థియేటర్లు చేతిలో వున్న యువి, గీతా, దిల్ రాజుల మధ్య వ్యాపార బంధాలు వుండడం, నైజాంలో సునీల్ తో సయోధ్య కుదరడం వంటివి దిల్ రాజు కు కలిసి వస్తున్నాయి. ఆయన ఎలా ప్లాన్ చేస్తే అలాగే వ్యవహారం నడుస్తుంది అన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఏపీ భవితవ్యం ఏమిటి? వాట్ నెక్ట్స్..?