మొన్నటివరకు అప్పుచేయాల్సిన అవసరం రాలేదు. ఓ సినిమా రివర్స్ కొట్టినా మరో సినిమా ఆదుకునేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కచ్చితంగా ఓ ముగ్గురు ఫైనాన్సియర్లు కావాల్సిందే. ఎందుకంటే దిల్ రాజుకు ఇప్పుడు కావాల్సింది 30 లేదా 40కోట్లు కాదు. ఏకంగా 200కోట్ల రూపాయలు.
అవును.. శంకర్ తో ఇండియన్-2 ప్రాజెక్టు ఎనౌన్స్ చేశాడు దిల్ రాజు. గతంలో కమల్ హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇది. భారీ బడ్జెట్ లేనిదే రంగంలోకి దిగడు శంకర్. అందుకే ఈ ప్రాజెక్టుకు 200కోట్ల రూపాయల బడ్జెట్ ఫిక్స్ చేశాడట దిల్ రాజు.
జస్ట్ స్టోరీలైన్ అనుకున్నందుకే ఇంత ఎమౌంట్ అయింది. కథ మొత్తం స్క్రీన్ ప్లేతో పాటు రాసుకొని అప్పుడు బడ్జెట్ లెక్కిస్తే ఇంకాస్త ఎక్కువే అవుతుంది. ప్రస్తుతానికైతే దిల్ రాజు ఫిక్స్ చేసుకున్న ఎమౌంట్ 200కోట్లు అన్నమాట.
దిల్ రాజు సినిమా తీస్తానంటే డబ్బులివ్వడానికి ఫైనాన్సియర్లంతా క్యూ కడతారు. అతడికి ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ అలాంటిది. కాకపోతే భారీ బడ్జెట్ సినిమాలు దిల్ రాజుకు కొత్త. అతడి కెరీర్ లో బడ్జెట్ పరంగా పెద్ద సినిమా అంటే డీజే మాత్రమే. ఇలాంటి దర్శకుడు ఇంత భారీ ప్రాజెక్టును ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.