శర్వానంద్-డైరక్టర్లు-ఫీలర్లు?

హీరో శర్వానంద్ హిట్ కొట్టాడు. శతమానం భవతి, మహానుభావుడు సినిమాల మధ్య రాధ ఏవరేజ్ టాక్ వినిపించలేదు. శర్వానంద్ ఇప్పుడు బ్యాంకబుల్ హీరో అయిపోయాడు. దీంతో ఈ జోష్ ను క్యాష్ చేసుకోవాలని ఇద్దరు…

హీరో శర్వానంద్ హిట్ కొట్టాడు. శతమానం భవతి, మహానుభావుడు సినిమాల మధ్య రాధ ఏవరేజ్ టాక్ వినిపించలేదు. శర్వానంద్ ఇప్పుడు బ్యాంకబుల్ హీరో అయిపోయాడు. దీంతో ఈ జోష్ ను క్యాష్ చేసుకోవాలని ఇద్దరు డైరక్టర్లు చూస్తున్నారు. శర్వానంద్ కూడా ఈ ఇద్దరు డైరక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రెండు స్క్రిప్ట్ లు సూత్ర ప్రాయంగా ఓకె చేసాడు. 

ఒకటి సుధీర్ వర్మ స్క్రిప్ట్. ఓ మాఫియా డాన్ బయోగ్రఫీ లాంటిది. అంటే మణిరత్నం నాయకుడు అంత సీరియస్ కాదు. కానీ అన్ని రకాల షేడ్స్ వుంటాయి. శర్వానంద్ ఎక్కువగా కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ కూడా వుంటుంది. కానీ అది ఎంతపాలు అన్నది తెలియదు. మొత్తంమీద సుధీర్ వర్మ స్టయిల్ మేకింగ్ మూవీనే.

రెండవది రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ స్క్రిప్ట్. ఇది ప్రేమకథాచిత్రమ్ సినిమా టైపు కథ. డిఫరెంట్ గా సైకలాజికల్ గా బిహేవ్ చేసే హీరోయిన్ క్యారెక్టర్. కాస్త గ్రాఫిక్స్ వుంటాయి. ఈ సినిమా షూట్ కొంత ఓవర్ సీస్ లో వుంటుంది.  

ఇప్పుడు ఏ సినిమా ముందు స్టార్ట్ అవుతుందన్నది పాయింట్. ఈ విషయంలో శర్వానంద్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఏది ముందు చేస్తాడు.. ఏది వెనుక చేస్తాడు అన్న విషయంలో రెండు యూనిట్లకు క్లారిటీ లేదన్నది క్లియర్. శర్వా కూడా ఈ విషయంలో డెసిషన్ తీసుకోకపోవడానికి కూడా కారణాలు వున్నాయి.

ఒకటి సుధీర్ వర్మ సినిమాలో హీరో రెండు రకాల షేడ్ ల్లో కనిపించాల్సి వుంది. అలా చేయాలంటే శర్వానంద్ రెండు సినిమాలు ఒకేసారి స్లయిమెంటేనియస్ గా చేయడం కుదరదు. లేదూ అంటే ప్రకాష్ సినిమా కొంత చేసేసి, ఆ తరువాత సుధీర్ వర్మ సినిమా చేయాలి. 

ఇక్కడ మరో సమస్య వుంది. ప్రస్తుతం హిట్ ట్రాక్ లో వున్నాడు శర్వా. దీన్ని ఇద్దరు డైరక్టర్లూ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు చేసిన సినిమా ఎవరిదైనా, ఫలితం తేడావస్తే, ఆ వెనకు వచ్చేవారిపై పడుతుంది. అది ఇద్దరికీ ఇష్టంలేదు. దీనికి తోడు శర్వా వర్కింగ్ స్టయిల్ వేరు. లీజర్ గా సినిమాలు చేయాలనుకుంటాడు.

పదిరోజులు షూట్ చేస్తే పదిహేను రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటాడు. అంటే ఒక సినిమా చేయాలంటే ఓ ఏడాది పట్టేస్తుంది. మహానుభావుడు షూటింగ్ నే ఇందుకు ఉదాహరణ. సినిమా సెట్ మీదకు వెళ్లడానికే మూడు నెలలు పట్టింది. ఇలా స్టార్ట్ చేసి అలా రెండు నెలలు విరామం తీసుకున్నారు. 

అలాంటిది ఇప్పుడు ప్రకాష్ సినిమా ముందు స్టార్ట్ అయితే సుధీర్ వర్మ ఒక ఏడాది వెయిటింగ్ లో వుండిపోవాల్సి వస్తుంది. ఓ డైరక్టర్ గా అది చాలా ఇబ్బందికరమైన విషయం. అందుకే ఎలాగైనా తన ప్రాజెక్టు ముందు స్టార్ట్ కావాలని సుధీర్ వర్మ కిందామీదా అవుతున్నట్లు వినికిడి. అయితే ఇదంతా చూసి హారికా చినబాబు (రాధాకృష్ణ) ఎప్పుడు అయితే అప్పుడే చేద్దాం, తొందరేం లేదు అనే వైఖరితో వున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మరోపక్క శర్వానంద్ ఓకె చేసిన ప్రకాష్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఫీలర్లు వచ్చాయి. కానీ ఈ ఫీలర్లు కరెక్ట్ కాదని, శర్వానంద్ ఆ సినిమా చేయడం పక్కా అని తెలుస్తోంది. ఎందుకంటే శర్వా ఆ సినిమాకు కాస్త పెద్ద మొత్తంలోనే అడ్వాన్స్ తీసుకున్నాడని వినికిడి. అంత పెద్ద మొత్తం తీసుకుని కమిట్ అయిన తరువాత ప్రాజెక్టు క్యాన్సిల్ అన్నది వుండకపోవచ్చు. మరి అలాంటపుడు ఈ ఫీలర్లు ఎందుకు వచ్చాయి? ఎవరి వైపు నుంచి వచ్చాయన్నది ఆలోచించాల్సిన విషయం. 

కొసమెరుపు ఏమిటంటే, శర్వానంద్ ఒకే అన్న రెండు లైన్లు పెద్దగా కొత్తవి కాకపోవడం. ఒకటి మాఫియా డాన్ ఆత్మకథ లాంటి థ్రిల్లర్ సినిమా. రెండవది ప్రేమకథాచిత్రమ్ లాంటి సైకలాజికల్ హర్రర్ సినిమా. శర్వా ఫ్యామిలీ క్లాస్ ఫన్ జోనర్ లోకి ఈ రెండూ రావు. మరి ఎలా ఓకె చేసినట్లో?