దిల్ రాజు.. ఓ రిలీజ్.. ఓ ఓపెనింగ్

నిర్మాత దిల్ రాజు సినిమా ఆఫీసు అచ్చంగా ఫిల్మ్ ఫ్యాక్టరీలాగే తయారవుతోంది. షూటింగ్ ల్లో రెండు, విడుదల దిశగా రెండు, ప్లానింగ్ లో రెండు, డిస్ట్రిబ్యూషన్ లో రెండు ఇలా సినిమాలే సినిమాలు. సుధీర్…

నిర్మాత దిల్ రాజు సినిమా ఆఫీసు అచ్చంగా ఫిల్మ్ ఫ్యాక్టరీలాగే తయారవుతోంది. షూటింగ్ ల్లో రెండు, విడుదల దిశగా రెండు, ప్లానింగ్ లో రెండు, డిస్ట్రిబ్యూషన్ లో రెండు ఇలా సినిమాలే సినిమాలు. సుధీర్ బాబు-నాని-ఇంద్రగంటి కాంబినేషన్ లో సినిమా రెడీ అవుతోంది. సమంత-శర్వా సినిమా షూటింగ్ జరుగుతోంది.

రాజ్ తరుణ్ హీరోగా నిర్మించిన చిన్న సినిమా నవంబర్ 8న విడుదలకు రెడీ చేసేస్తున్నారు. ఈలోగా ఈనెల 9న వివి వినాయక్ హీరోగా ప్లాన్ చేస్తున్న సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాలో వినాయక్ మెకానిక్ గ్యారేజ్ షెడ్ ఓనర్ గా కనిపించబోతున్నారు.

రాజ్ తరుణ్ సినిమాను సింపుల్ గా అయిదుకోట్లలో తీసేసి, నాన్ థియేటర్ హక్కులతో వెనక్కు తెచ్చేసుకున్నారు. ఇప్పుడు ఓన్ గా విడుదలకు రెడీ చేస్తున్నారు. డిసెంబర్ లో శర్వా-సమంత సినిమా విడుదలకు రెడీ అవుతున్నారు.

జనవరిలో నాలుగు సినిమాలు దిల్ రాజు విడుదలలే. సరిలేరు, అల, సర్కార్, ఎంత మంచివాడవురా ఈ నాలుగు కూడా దిల్ రాజే విడుదల చేస్తున్నారు. అదీ విషయం.

సినిమా వస్తేనే.. యోధుడు గుర్తుకు వచ్చాడు!