హీరో కొడుకు, దర్శకుడి కూతురు.. ప్రేమాయణం?

మలయాళీ చిత్ర ప్రముఖులు అయిన మోహన్ లాల్, ప్రియన్ దర్శన్ లు అత్యంత సన్నిహితులు అనే పేరుంది. వీరిద్దరూ స్నేహానికి నిర్వచనం అని అంటారు. సినీ పరిశ్రమల్లోని బెస్ట్ ఫ్రెండ్స్ లో వీరిద్దరూ ప్రముఖంగా…

మలయాళీ చిత్ర ప్రముఖులు అయిన మోహన్ లాల్, ప్రియన్ దర్శన్ లు అత్యంత సన్నిహితులు అనే పేరుంది. వీరిద్దరూ స్నేహానికి నిర్వచనం అని అంటారు. సినీ పరిశ్రమల్లోని బెస్ట్ ఫ్రెండ్స్ లో వీరిద్దరూ ప్రముఖంగా నిలుస్తారని అంటారు. వీరిద్దరిదీ విజయవంతమైన కాంబినేషన్ కూడా. ప్రియదర్శన్ దర్శకత్వంలో బోలెడన్ని సినిమాల్లో నటించాడు మోహన్ లాల్. చివరగా వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా తెలుగులోకి కూడా అనువాదం అయ్యింది. అదే 'కనుపాప'.

ఆ సంగతలా ఉంటే.. తండ్రుల స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారట వీరి సంతానం. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్, ప్రియదర్శన్ కూతురు కల్యాణిలు మంచి స్నేహితులట. అంతే కాదు..వీరిద్దరూ  ప్రేమించుకుంటున్నారని  కూడా ప్రచారం జరుగుతూ ఉంది. తను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్టుగా ఇది వరకూ ప్రకటించింది కల్యాణి. అతడు మరెవరో కాదు.. మోహన్ లాల్ తనయుడే అనే ప్రచారం సాగుతూ ఉంది.

వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. తను ప్రేమలో ఉన్న మాట అయితే వాస్తవం అని, అదెవరో మాత్రం ఇప్పుడు  చెప్పేది లేదని అంటోంది కల్యాణి. మోహన్ లాల్, ప్రియదర్శన్ ల సాన్నిహిత్యం రీత్యా.. వీరి ప్రేమ కథ ఎంత వరకూ వెళ్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది.

సినిమా వస్తేనే.. యోధుడు గుర్తుకు వచ్చాడు!