గౌతమ్ నందా సినిమా ఈ నెల 14న విడుదల అది ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ విషయపై డౌట్లు వినిపిస్తున్నాయి. ఈ రోజు కూడా ముంబాయిలో ప్యాచ్ వర్క్ చేసారు.
సినిమాను ఎలాగైనా తాను 7వ తేదీకి సెన్సారు కు ఇచ్చి, తోమ్మిది కల్లా క్యూబ్ అప్ లోడ్ కు అందిస్తా అని దర్శకుడు సంపత్ నంది అంటున్నారట. ఆరు నూరైనా సరే, ఈ నెల 14న విడుదల చేయాల్సిందే అని హీరో గొపీచంద్ పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ఇప్పడు కనుక వన్ వీక్ వాయిదా పడినా ఇండస్ట్రీలోకి రాంగ్ సిగ్నళ్లు వెళ్లి పోతాయి. అసలే గోపీచంద్ సినిమాలు రెండు అలా పడి వున్నాయి. ఇప్పుడు ఈ సినిమా విడుదలై, హిట్ అయితే వాటికి మోక్షం వస్తుంది. మరోపక్క సినిమా నిర్మాణం కాక, ఇతర సమస్యలు వున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ వాటిపై క్లారిటీ లేదు. గౌతమ్ నందా సినిమాకు 25 నుంచి 30 కోట్ల బడ్జెట్ పెట్టేసారు. గోపీచంద్ మార్కెట్ రీత్యా ఇది చాలా ఎక్కువే. సంపత్ నంది బెంగాల్ టైగర్ లాంటి హిట్ సినిమా వసూళ్లు ఈ రేంజ్ లోనే వున్నాయి. అదే నిర్మాతల ధీమా కావచ్చు.
మరోపక్క గౌతమ్ నందా వాయిదా పడితే బరిలో దిగడానికి వారాహి వారి 'పటేల్ సర్' రెడీ చేస్తున్నారు. జగపతి బాబు నటించిన డిఫరెంట్ థ్రిల్లర్ ఇది. ఓ పాప చుట్టూ తిరిగే యాక్షన్ మూవీ. అలాగే గౌతమ్ నందా విడుదల వాయిదా పడితే, తమ సినిమా వైశాఖం విడుదల చేయాలని ఆర్ జే సినిమాస్ బి ఎ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ముంబాయి నుంచి గౌతమ్ నందా టీమ్ ఆదివారం ఇక్కడకు వస్తుంది. అప్పుడు ఓ క్లారిటీ రావచ్చని తెలుస్తోంది. ఈ మేరకు రేపు మీడియా ప్రకటన కూడా చేసే అవకాశం వుంది.