ముచ్చట పడి తయారుచేసుకున్న టీజర్ లీకయిన షాక్ నుంచి జైలవకుశ యూనిట్ చాలా వేగంగానే తేరుకుంది. సినిమాలో ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
లీకయిన టీజర్ మొత్తం కేవలం జయ్ క్యారెక్టర్ మీదే ఫోకస్ అయిన సంగతీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా యూనిట్ కూడా అదే ప్రకటించింది.
మూడు క్యారెక్టర్లకు మూడు టీజర్లు అవసరం అంటూ. అందుకే ముందుగా జయ్ క్యారెక్టర్ టీజర్ ను ఈనెల 6వ తేదీన విడుదల చేస్తారట. అంటే కాస్త గ్యాప్ ఇచ్చి మిగిలిన రెండు టీజర్లు కూడా వదుల్తారన్నమాట.
ఫ్యాన్స్ కు పండగే పండగ. పైగా సినిమా విడుదలకు ఇంకా దగ్గర దగ్గర రెండున్నర నెలల టైమ్ వుంది కాబట్టి, ఇలా వన్ బై వన్ టీజర్లు, లుక్ లు, ఆ పై ట్రయిలర్ తో సినిమాకు గ్రాడ్యువల్ గా బజ్ తెచ్చే ప్లాన్ బాగానే వేసినట్లుంది.