ఆలు లేదు చూలు లేదు, అన్న సామెతలా వుంది ఒకప్పటి హీరోయిన్ చార్మి ఇప్పటి వ్యవహారం. పూరి కనెక్ట్స్ అనే సంస్థను పెట్టుకుని, ఏదో కిందా మీదా పడుతూ, ఫుల్ బిజీగా వుంటోంది.
అయితే బాలయ్య సినిమాకు ప్రత్యేక ప్యాకేజీగా చార్మికి మూడు నాలుగు కోట్లు ముట్టిందని తెగ గ్యాసిప్ లు తెగ వినిపించాయి. కానీ అది అస్సలు నిజం కాదట.
సినిమాను 'ఇంతలో' ఫినిష్ చేసి ఫస్ట్ కాపీ ఇవ్వడానికి పూరి ఎప్పటి లాగే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి అందులో చార్మికి ఏమిచ్చుకున్నా, ఆ అమ్మడు ఏం పుచ్చుకున్నా అది పూరికే తెలియాలి.
అలా చార్మి ఖాతాలో ఏ మాత్రం క్రెడిట్ పడ్డా, డెబిట్ మాత్రం పూరికే అని తెలుస్తోంది. అందువల్ల చార్మికి సినిమా తీసినన్నాళ్లు, కాలక్షేపం, పూరి కనెక్ట్స్ సిఇఓ గా శాలరీ తప్ప, బాలయ్య సినిమా మరీ భారీగా పైసావసూల్ అన్నది లేదంట.
ఎందుకంటే ఈ సినిమాకు మరీ భారీ బడ్జెట్ ఏమీ కేటాయించలేదు. బాలయ్య రెమ్యూనిరేషన్ కాకుండా, పాతిక కోట్ల రేంజ్ లోనే సినిమా తీసి అందిస్తానని పూరి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి అలాంటపుడు ఇక చార్మికి మిగిలేదేముంటుంది పాపం? గ్యాసిప్ ల్లో నలగడం తప్ప.