అటు సినిమా.. ఇటు జైలు.. మధ్యలో దిలీప్

మలయాళ నటి కిడ్నాప్, ఆమెపై లైంగిక దాడి కేసుకు సంబంధించి దిలీప్ అరెస్ట్ అయి మొన్నటికి సరిగ్గా 2 నెలలైంది. ఈ 2 నెలల్లో దిలీప్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను 2 సార్లు తిరస్కరించింది…

మలయాళ నటి కిడ్నాప్, ఆమెపై లైంగిక దాడి కేసుకు సంబంధించి దిలీప్ అరెస్ట్ అయి మొన్నటికి సరిగ్గా 2 నెలలైంది. ఈ 2 నెలల్లో దిలీప్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను 2 సార్లు తిరస్కరించింది కేరళ హైకోర్టు. తాజాగా మరోసారి బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నాడు దిలీప్. ఈరోజు ఈ బెయిల్ పిటిషన్ కేరళ హైకోర్టులో విచారణకు రానుంది. 

న్యాయ నిపుణుల అంచనా ప్రకారం ఈరోజు దిలీప్ కు బెయిల్ వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే కేసుకు సంబంధించి దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిందని పోలీసులు ప్రకటించారు. దిలీప్ ఇక సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం లేదని కోర్టు నమ్మితే అతడికి బెయిల్ వస్తుంది. 

దిలీప్ కు బెయిల్ రావొచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అతడు నటించిన ఓ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. దిలీప్ నటించిన రామలీలా సినిమా ఇన్నాళ్లూ వాయిదాపడుతూ వస్తోంది. ఈ సినిమాను ఈనెల 28న విడుదల చేస్తామని తాజాగా మేకర్స్ ప్రకటించారు. 

సో.. దిలీప్ కు కనుక బెయిల్ దొరికితే ఈ సినిమా ప్రచారంలో పాల్గొంటాడని యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో కూడా దిలీప్ జైలుకెళ్లే సన్నివేశాలు ఉన్నాయట. ఫైనల్ గా ఓ రాజకీయ నాయకుడిగా దిలీప్ ఎదగడంతో సినిమా ముగుస్తుందట.